4. గత రెండు వారాలుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మార్చి 9న 22 క్యారట్ గోల్డ్ ధర రూ.50,900 ఉండగా రూ.4100 పెరిగింది. ఇక అదే రోజున 24 క్యారట్ గోల్డ్ ధర రూ.55,530 ఉండగా రూ.4470 పెరిగింది. ఇక మార్చి 10న కిలో వెండి ధర రూ.67,300 ఉండగా రెండు వారాల్లో కిలో వెండిపై ఏకంగా రూ.8,400 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగితే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ 2023 ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.25 శాతం అంటే రూ.147 తగ్గి రూ.59,418 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మే ఫ్యూచర్స్ 0.04 శాతం అంటే రూ.28 తగ్గి రూ.70,184 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఔన్స్ బంగారం ధర 2000 డాలర్లకు చేరువవుతోంది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,991.20 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర పెరిగింది. ఔన్స్ సిల్వర్ ధర 23.00 డాలర్లు దాటింది. ప్రస్తుతం 23.22 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)