2016లో నవంబర్ కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చెలామణీలో ఉన్న ఆ నోట్లను మార్చుకోవడానికి కొంత సమయం కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవి చెల్లని చిత్తు కాగితాలుగా మారాయి. అయితే కొందరికి పాత నోట్లను సేకరించడం, దాచిపెట్టుకోవడం వంటి అలవాటు ఉంటుంది. మరికొందరు ఎక్కడైనా పెట్టి వదిలేసినా వారు కూడా ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రింటింగ్ సమయంలో కొన్ని పొరపాట్లతో కనుక.. నోట్లు మార్కెట్లోకి విడుదలైతే అవి ప్ర్యతేకంగా మారుతాయి. పాత రూ. 500 ముద్రణ సమయంలో కూడా ఆర్బీఐ కొంత తప్పు చేసింది. అలాంటి నోట్లను డీమానిటైజేషన్ తర్వాత కొందరు కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకు రూ. 10 వేల వరకు చెల్లిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
మీ వద్ద ఉన్న పాత రూ. 500 నోట్‌పై సీరియల్ నెంబర్ రెండు సార్లు ముద్రించి ఉంటే.. మీరు రూ. 5వేలు పొందే అవకాశం ఉంది. అలాగే పాత రూ.500 నోటుపై ఒకవైపు అంచు ఎక్కువ ఉంటే.. దానిని రూ. 10 వేలకు విక్రయించవచ్చు. అంటువంటి నోట్ల ఫొటోలు తీసి.. వాటిని ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడమే. ఇందుకోసం పాత నోట్లు, నాణేలు.. కొనుగోలు, విక్రయియాలు జరుపుతున్న కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)