ప్రస్తుతం పాత పన్ను విధానం (Old Tax Regime), కొత్త పన్ను (New Tax Regime) విధానం అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ పన్ను విధానం ద్వారా ట్యాక్స్ ఫైల్ చేస్తే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయనే అంశంలో చాలా మంది తికమక పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో డిడక్షన్స్ కారణంగా పాత పన్ను విధానం మెరుగ్గా ఉంటుంది.
* అగ్నివీర్ కార్పస్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ : బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. ఆదాయ పన్ను చట్టంలో కొత్తగా ప్రతిపాదించిన సెక్షన్ 80 CCH ప్రకారం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు చెల్లించిన లేదా డిపాజిట్ చేసిన ఏదైనా మొత్తాన్ని అగ్నివీర్ ఆదాయం నుంచి మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చని ప్రకటించారు.
అగ్నిపథ్ స్కీమ్, 2022లో నమోదు చేసుకున్న అగ్నివీర్స్, కార్పస్ ఫండ్ నుంచి అందుకున్న పేమెంట్స్‌ను ట్యాక్సెస్ నుంచి మినహాయించాలని పేర్కొన్నారు. సేవా నిధి అకౌంట్లో అతను లేదా కేంద్ర ప్రభుత్వం చేసిన కాంట్రిబ్యూషన్స్‌పై వచ్చిన మొత్తం ఇన్‌కంపై డిడక్షన్ క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతించాలని ప్రపోజ్ చేశారు.
బడ్జెట్ 2023 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. జీతం పొందే వ్యక్తికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్, రూ.15,000 వరకు కుటుంబ పెన్షన్ నుంచి మినహాయింపు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయం పాత పన్ను విధానంలో మాత్రమే ఉండేదని, ప్రస్తుతం కొత్త పన్ను విధానంలోనూ కల్పించాలని ప్రపోజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.