Ola Scooter: నెలకు రూ.2 వేలతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేయండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి. వెళ్లొచ్చు!
Ola Scooter: నెలకు రూ.2 వేలతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేయండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి. వెళ్లొచ్చు!
Electric Scooter | మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే నెలకు రూ.2 వేల కన్నా తక్కువ ఈఎంఐలో స్కూటర్ ఎలా కొనాలో తెలుసుకోండి.
e-Scooter | మీరు కొత్త స్కూటర్ కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? పెట్రోల్ ఖర్చు భరించడం కన్నా ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే బెటరని యోచిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. నెలకు రూ.2 వేలు కడితే చాలు అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు.
2/ 8
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఓలా దుమ్మురేపుతోందని చెప్పుకోవచ్చు. మార్కెట్లో ఇది అధిక వాటాతో దూసుకుపోతోంది. మీరు కూడా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈజీగానే ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు ఒకసారి తెలుసుకోండి.
3/ 8
ఓలా కంపెనీ మూడు రకాల మోడళ్లను అందిస్తోంది. వీటిల్లో ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1, ఓలా ఎస్ 1 ప్రో అనేవి ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ. 84,999, రూ. 1,09,999, రూ. 1,39,999గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఓలా ఎస్ 1 ఎయిర్ మోడల్‌ను తక్కువ ఈఎంఐలో ఎలా కొనాలో తెలుసుకుందాం.
4/ 8
ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ. 84,999గా ఉంది. ఇప్పుడు మీరు కనీసం రూ. 10 వేలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే అప్పుడు మీరు 74,999కు లోన్ తీసుకోవచ్చు. ఓలా ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, లిక్విలోన్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
5/ 8
అందువల్ల ఓలా స్కూటర్ కొనే వారు వీటి నుంచి లోన్ పొందొచ్చు. ఐసీఐసీఐలో వడ్డీ రేటు 11.26 నుంచి, ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో 8.99 నుంచి, యాక్సిస్ బ్యాంక్‌లో 11.88 నుంచి, లిక్విలోన్స్లో 8.99 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతోంది.
6/ 8
ఇప్పుడు మీరు డౌన్ పేమెంట్ రూ. 15 వేలు చెల్లించారని అనుకుందాం. ఇప్పుడు మిగిలిన మొత్తానికి లోన్ తీసుకోవాలి. 8.99 శాతం వడ్డీ రేటు ప్రకారం లోన్ పొందితే.. అప్పుడు 48 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 1982 ఈఎంఐ పడుతుంది. అంటే మీరు దాదాపు రూ. 70 వేలకు లోన్ తీసుకోవాల్సి వస్తుంది.
7/ 8
ఇకపోతే 36 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 2,500 ఈఎంఐ పడుతుంది. అదే 24 నెలల టెన్యూర్ అయితే రూ. 3,500 చెల్లించాల్సి వస్తుంది. ఇక ఏడాది ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 6,400 చెల్లించాలి. కాగా లోన్ తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఈ డబ్బులు ఆదా అవుతాయి.
8/ 8
అదే మీరు ఇతర మోడళ్లు కొనుగోలు చేయాలని భావిస్తే.. అప్పుడు నెలవారీ ఈఎంఐ కూడా పెరుగుతుంది. అప్పుడు డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాలి. ఇలా చేేస్తే నెలవారీ ఈఎంఐ పెరగకుండా చూసుకోవచ్చు. లేదంటే మీరు వేరే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు.