* ఓలా కేర్ : ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లలో భాగంగా కస్టమర్స్ అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ప్రధానంగా ఫ్రీ హోమ్ సర్వీసింగ్, ఫ్రీ హోమ్ పికప్ అండ్ డ్రాప్, థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు నాన్ యాక్సిడెంటల్, నాన్ ఇన్సూరెన్స్ కేసులకు కన్సూమబుల్ రీప్లేస్ మెంట్లను ఉచితంగా పొందవచ్చు.
* ఓలా కేర్ + : ఓలా కేర్ ప్లాన్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలు ఓలా కేర్ + ప్లాన్‌తో పొందవచ్చు. ఒక సంవత్సరం పాటు స్కూటర్ ఇన్స్పెక్షన్, ఫ్రీ లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్ట్ అసిస్టెన్స్ హెల్ప్‌లైన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ తోపాటు యాన్యువల్ కాంప్రిహెన్సివ్ డైగ్నాస్టిక్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్/డ్రాప్ సౌకర్యం, ఫ్రీ కన్జ్యూమబుల్స్ సేవలు పొందవచ్చు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే 24×7 డాక్టర్, అంబులెన్స్ సర్వీసులను ఓలా కేర్ + ప్లాన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.
ఎక్కడికైనా వెళ్లినప్పుడు అర్ధాంతరంగా స్కూటర్ ఆగిపోతే, టోయింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఉచితంగా టాక్సీ రైడ్ సర్వీస్ పొందవచ్చు. సిటీ బయటకు వెళ్లినప్పుడు స్కూటర్ బ్రేక్ డౌన్ అయితే ఫ్రీ హోటల్ వసతి, టోయింగ్ సర్వీస్ కోసం వెయిట్ చేసే సమయాన్ని తగ్గించడానికి వెహికల్ కస్టడీ సర్వీస్ కూడా ఓలా కేర్ ప్లస్‌తో పొందవచ్చు.
* సర్వీస్ నెట్‌వర్క్‌కు 360 డిగ్రీస్ యాక్సెస్ : ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. కస్టమర్ సెంట్రిక్ బ్రాండ్ అయిన ఓలా, కస్టమర్ సర్వీస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా రీబిల్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
కస్టమర్ల కోసం బెస్ట్ ఇన్-క్లాస్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ లక్ష్యంగా కంపెనీ పనిచేస్తోందన్నారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ కస్టమర్లకు కంపెనీ సర్వీస్ నెట్‌వర్క్‌కు 360 డిగ్రీస్ యాక్సెస్ ఉంటుందన్నారు. ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కంపెనీ కస్టమర్లకు సర్వీస్‌లను వారి ఇంటి వద్ద లేదా సమీపంలోని ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లలో అందించనుందన్నారు.
* ఏప్రిల్ నుంచి డెలివరీలు? : ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ దేశంలో ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో, ఓలా ఎస్ 1 ఎయిర్ పేరుతో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఓలా ఎస్ 1 ఎయిర్‌ను గత ఏడాది దీపావళికి కంపెనీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన డెలివరీలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది. రానున్న రోజుల్లో సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేసేందుకు ఓలా సిద్ధమవుతోంది.