OKAYA ELECTRICS FAAST E SCOOTER RUNS UP TO 200 KM ON FULL CHARGE HERE PRICE AND SPECIFICATIONS DETAILS NS
Okaya Electric Faast E-scooter: కేవలం రూ. 1999కే ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్.. ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 200 కి.మీ ప్రయాణం.. స్పీడ్ 70kmph
Okaya Electric E-scooter: మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ ను కేవలం రూ. 1,999తో బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్‌లు భారతీయ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న EV ఎక్స్పో 2021లో ఫాస్ట్ అనే హై-స్పీడ్ ఈ-స్కూటర్ ను పరిచయం చేసింది Okaya ఎలక్ట్రిక్ స్కూటర్.
2/ 6
ఈ కొత్త స్కూటర్ ధర రూ.90,000 మరియు కేవలం రూ.1,999తో బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకాయ ఎలక్ట్రిక్ అధికారిక వెబ్సైట్ ద్వారా మరియు డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు
3/ 6
ఒకాయ ఫాస్ట్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 kWh లిథియం-ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌తో పని చేస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 150 కి.మీ ప్రయాణిస్తుందని సంస్థ చెబుతుంది. జాగ్రత్తగా వాడితే ఒక్క సారి ఛార్జి చేస్తే 200 కి.మీ ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది.
4/ 6
ఒకాయ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి LED లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 60-70 కి.మీ.
5/ 6
ఒకాయ ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫెర్రాటోను రాబోయే రోజుల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2022లో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇ-మోటార్‌సైకిల్ 2 kW మోటార్ మరియు 3 kW బ్యాటరీతో వస్తుంది. దీనిని గంటకు 90 కిమీ వేగంతో నడపవచ్చు.
6/ 6
ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 100 కి.మీ ప్రయాణిస్తుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా అవతరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టార్టప్ 6 నెలల్లో దేశవ్యాప్తంగా 225 డీలర్‌షిప్‌లను సృష్టించడం విశేషం.