1. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1న కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించాయి కంపెనీలు. కమర్షియల్ సిలిండర్ ధర కొనేవారికి షాక్ ఇచ్చాయి కంపెనీలు. సిలిండర్ ధరను భారీగా పెంచాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. కమర్షియల్ సిలిండర్ ధర రూ.73.50 పెరిగింది. కమర్షియల్ సిలిండర్ను ఎక్కువగా హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తుంటారు. కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వ్యాపారులకు షాకే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.84 పెరిగింది. ఇప్పుడు రూ.73.50 పెరిగింది. అంటే నెల రోజుల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర రూ.157.50 పైనే పెరగడంతో వ్యాపారులపై భారీగా భారం పడనుంది. హైదరాబాద్లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.1803. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఇక సామాన్యులకు ఊరట కలిగించాయి ఆయిల్ కంపెనీలు. సబ్సిడీ సిలిండర్ ధరను పెంచలేదు. పాత ధరలే కొనసాగుతాయి. హైదరాబాద్లో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.887. గత నెలలో సబ్సిడీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ఇక కమర్షియల్ సిలిండర్ ధరలు ఇతర ప్రాంతాల్లో చూస్తే ఢిల్లీలో రూ.1,623, కోల్కతాలో రూ.1,623, ముంబైలో రూ.1,579.50, చెన్నైలో రూ.1,761. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. ప్రతీ నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. ఆయిల్ ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలపై ఆధారపడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)