* రూ.10,000 కోట్ల బడ్జెట్ : 2019 ఏప్రిల్ 1 నుంచి అయిదేళ్ల కాలానికి రూ.10,000 కోట్లతో ఫేమ్ (FAME) ఇండియా స్కీమ్ ఫేజ్-2ను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా ఈవీలు కొనుగోలు చేసేవారికి వెహికల్ కాస్ట్లో రాయితీ ఇస్తారు. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ఈ రాయితీ లభిస్తుంది. రూ.10,000/KWh బ్యాటరీ సామర్థ్యంతో ఉండే e-3W, e-4W వాహనాలకు దాని ధరలో 20 శాతం రాయితీ లభిస్తుంది. e-2W వెహికల్స్కు ఈ ప్రోత్సాహకాన్ని 20 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. అంటే రూ.10,000/KWh నుంచి రూ.15,000/KWhకు ఈ మొత్తాన్ని పెంచారు. 2021 జూన్ 11 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు.
* పీఎల్ఐ పథకాలు : దేశంలో ఏసీసీ బ్యాటరీల తయారీ కోసం 2021 మే 12న రూ.18,100 కోట్లతో పీఎల్ఐ (PLI) పథకాన్ని ఆమోదించారు. ఇందులో 50 GWh ఏసీసీ బ్యాటరీలను తయారు చేస్తారు. అదే ఏడాది 2021 సెప్టెంబర్ 15న పీఎల్ఐ మరో పీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆటోమోటీవ్ రంగంలోని పీఎల్ఐ స్కీంకు రూ.25,938 కోట్లు కేటాయించారు.