నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS)ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA). ఇకనుంచి సబ్స్క్రైబర్లకు మరిన్ని ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను సంస్థ అందించనుంది. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కేటాయింపులను PFRDA పెంచింది. ఈ మేరకు NPS సబ్స్క్రైబర్లకు ఈక్విటీ అలొకేషన్ స్టాండర్డ్స్‌ను సవరించింది.
ఈక్విటీకి 100 శాతం కేటాయింపు
NPS సబ్స్క్రైబర్లు ఇప్పుడు 51 సంవత్సరాల వయసు నుంచి ఎటువంటి షరతులు లేకుండా యాక్టివ్ చాయిస్‌తో తమ ఫండ్లలో 75 శాతం వరకు ఈక్విటీ(E)లో పెట్టుబడి పెట్టవచ్చు. అదే విధంగా 51 సంవత్సరాల వయసు నుంచి ఎటువంటి షరతులు లేకుండా యాక్టివ్ చాయిస్ కింద టైర్-II (ఆప్షనల్ అకౌంట్)లో అసెట్ క్లాస్ E (ఈక్విటీ)కి సబ్స్క్రైబర్లు తమ కాంట్రిబ్యూషన్లో 100 శాతం కేటాయించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రత్యామ్నాయంగా అసెట్ క్లాస్ G(గవర్నమెంట్ సెక్యూరిటీస్)లో 100 శాతం వరకు, అసెట్ క్లాస్ C(కార్పొరేట్ బాండ్స్)లో 100 శాతం వరకు కేటాయించవచ్చు. అసెట్ క్లాస్ E(ఈక్విటీ)లో 75 శాతం, అసెట్ క్లాస్ A(ఆల్టర్నేటివ్ అసెట్స్)కి 5 శాతం కాంట్రిబ్యూషన్స్ కేటాయించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అదే విధంగా 51 సంవత్సరాలకు 72.5, 52కి 70, 53కి 67.5గా లిమిట్ ఉంటుంది. 54 సంవత్సరాలకు 65, 55కి 62.5, 56కి 60గా లిమిట్ పేర్కొన్నారు. 57 ఏళ్లుఉన్న వారికి 57.5, 58కి 55, 59కి 52.5, 60 సంవత్సరాలు అంతకు పైబడిన వారికి 50గా ఉంది. అయితే అసెట్ క్లాస్ ఎక్స్పోజర్పై పరిమితులు ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్‌లోని టైర్ I కస్టమర్లపై విధించారు. అన్ని టైర్ II సబ్స్క్రైబర్లు అసెట్ క్లాస్ E(ఈక్విటీ)కి 100 శాతం కేటాయించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
* అసెట్ క్లాస్ పనితీరు తెలుసుకోవాలి
పెన్షన్ ఫండ్లు వివిధ అసెట్ క్లాస్‌ల కింద సంబంధిత పథకాల రిస్క్ ప్రొఫైలింగ్‌ను సిద్ధం చేశాయని, ఇందులో ఉన్న స్వాభావిక రిస్క్‌ల స్థాయిని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని PFRDA పేర్కొంది. పెట్టుబడి పథకం/అసెట్ క్లాస్ ఎంచుకోవడానికి ముందు, సబ్స్క్రైబర్లు అసెట్ క్లాస్ పనితీరును, ఇందులో ఉన్న నష్టాలను స్వతంత్రంగా అంచనా వేయాలని సూచించింది. పథకం రిస్క్ ప్రొఫైల్ ప్రకారం ఎంచుకోవాలని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
సబ్స్క్రైబర్లు వివిధ అసెట్ క్లాస్‌లను ఎంచుకొనే అవకాశం ఇస్తుంది నేషనల్ పెన్షన్ సిస్టమ్. ప్రభుత్వ బాండ్లు, ఈక్విటీ మార్కెట్, కార్పొరేట్ రుణాలతో సహా టైర్ 1, టైర్ 2 అకౌంట్లను NPS అందిస్తుంది. టైర్ 1 NPS అకౌంట్ పెన్షన్ అకౌంట్ అయితే, టైర్ 2 అకౌంట్‌ను ఇన్వెస్ట్మెంట్గా పిలుస్తారు. ఇది పెన్షన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (PRAN) అందించిన స్వచ్ఛంద సేవింగ్ అకౌంట్.