2. అయితే ఎంత ముందుగా పొదుపు ప్రారంభిస్తే అంత భారీ రిటర్న్స్ వస్తాయి. ఇక పొదుపు చేయడానికి అనేక పొదుపు పథకాలు (Savings Schemes) అందుబాటులో ఉన్నాయి. కొన్ని పొదుపు పథకాలు మంచి రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి ప్రభుత్వ పథకంలో ఒకటి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). దీన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని అంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ కోసం పొదుపు చేయాలని అనుకుంటే, చిన్న వయస్సులోనే పొదుపు ప్రారంభిస్తారు కాబట్టి రిటైర్మెంట్ సమయానికి మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఆ వ్యక్తి ప్రతీ రోజూ రూ.200 చొప్పున నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకంలో పొదుపు చేస్తే నెలకు రూ.6,000 పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇలా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేస్తే అతనికి వచ్చే రిటర్న్స్ ఎంతో తెలుసా? సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రిటైర్మెంట్ సమయానికి అప్పటివరకు జమచేసిన మొత్తం, వడ్డీ కలిపి సుమారు రూ.50 లక్షలు డ్రా చేయొచ్చు. లేదా ప్రతీ నెలా పెన్షన్ కావాలనుకుంటే రూ.50 లక్షలు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. వడ్డీ 8 శాతం చొప్పున లెక్కించినా నెలకు రూ.50,000 ప్రతీ నెలా అకౌంట్లోకి వస్తాయి. అంటే ప్రతీ నెలా రూ.50,000 పెన్షన్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. నేషనల్ పెన్షన్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పెట్టుబడి పథకం. ఎన్పీఎస్ ఖాతాదారులు ఈ స్కీమ్‌లో పొదుపు చేసే డబ్బులు కొంత డెట్‌లోకి, ఇంకొంత ఈక్విటీలోకి వెళ్తాయి. ఖాతాదారులు తమ రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి 75:25, 50:50, 40:60 చొప్పున డెట్, ఈక్విటీ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి రిటర్న్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)