1. ఇండియాలో యూపీఐ(UPI) పేమెంట్స్ సర్వసాధారణంగా మారాయి. ప్రతి చిన్న వస్తువు కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఫిజిక్ క్యాష్ వినియోగదం చాలా వరకు తగ్గింది. ఇప్పుడు యూపీఐ(UPI) పేమెంట్స్ ట్రాన్సాక్షన్లపై ఎటువంటి పరిమితులు లేవు. వినియోగదారులు రోజులో ఎన్ని యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్లు అయినా చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా సెండ్ చేసే మ్యాక్సిమం అమౌంట్‌పైనే లిమిట్ ఉంది. అయితే త్వరలో గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(PhonePe), పేటీఎం(Paytm), ఇతర UPI పేమెంట్స్ యాప్‌లు ట్రాన్సాక్షన్లపై లిమిట్ విధించే అవకాశం ఉంది. వినియోగదారులు UPI పేమెంట్స్ యాప్‌ల ద్వారా అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్లు చేసే సదుపాయం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. UPI డిజిటల్ పైప్‌లైన్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తోంది. యూపీఐ పేమెంట్స్ వాల్యూమ్‌ను 30 శాతానికి పరిమితం చేయడానికి NPCI రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం వాల్యూమ్ క్యాప్ లేదు. Google Pay, PhonePe మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2022 నవంబర్‌లో కాన్సెన్ట్రేషన్ రిస్క్‌ను నివారించడానికి, NPCI థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) కోసం 30 శాతం వాల్యూమ్ క్యాప్‌ను ప్రపోజ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం NPCI అన్ని ఆప్షన్లను పరిశీలిస్తుండటంతో డిసెంబర్ 31 గడువును పొడిగించడంపై తుది నిర్ణయం తీసుకోలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. అయితే యూపీఐ మార్కెట్ క్యాప్ అమలుపై ఈ నెలాఖరులోగా NPCI నిర్ణయం తీసుకోనుంది. 2020లో NPCI ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అందులో.. థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించే ట్రాన్సాక్షన్ పరిమాణంలో 30 శాతం ప్రాసెస్ చేయగలదని తెలిపింది. 2021 జనవరి 1 నుంచి ప్రాసెస్ చేసిన ట్రాన్సాక్షన్ల పరిమాణాన్ని అంతక ముందు మూడు నెలల్లో ప్రాసెస్ చేసిన వాల్యూమ్ ఆధారంగా లెక్కిస్తారని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. 2022 అక్టోబర్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 7.3 ట్రిలియన్లకు చేరుకుంది. గత అక్టోబరుతో పోలిస్తే ఇది దాదాపు మూడు వంతుల పెరుగుదలను నమోదు చేసింది. ప్రతిరోజూ దాదాపు 26 కోట్లకు పైగా డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు ఇండియన్ పేమెంట్ష్ సిస్టమ్‌ల ద్వారా ప్రాసెస్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)