కరోనా కష్టకాలం మొదలైన తరువాత గోల్డ్ లోన్లకు డిమాండ్ పెరిగింది. బ్యాంకులన్నీ గోల్డ్ లోన్స్‌ను మరింత సులభతరం చేసేందుకు బ్యాంకులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఎస్బీఐ మరో ముందడుగు వేసింది. (ఫ్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఎస్బీఐ యోనో యాప్ ద్వారా గోల్డ్ లోన్ మరింత వేగంగా పొందే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా వినియోగదారులు ముందుగా మొబైల్లోని యోనో యాప్‌ను ఓపెన్ చేయాలి.(ఫ్రతీకాత్మక చిత్రం)
3/ 5
అందులోని లోన్స్ ఆప్షన్లపై క్లిక్ చేయాలి. ఆ తరువాత గోల్డ్ లోన్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆప్లై నౌ పైక్లిక్ చేయాలి. అనంతరం అందులో ఆభరణాల వివరాలను డ్రాప్‌డౌన్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఇతర వివరాలు పొందుపర్చాలి.(ఫ్రతీకాత్మక చిత్రం)
4/ 5
అందులో వినియోగదారుడి నెలవారీ ఆదాయాన్ని పొందుపర్చాలి. ఆ తరువాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. అనంతరం బంగారంతో దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంకును సంప్రదించాలి.(ఫ్రతీకాత్మక చిత్రం)
5/ 5
తాకట్టు పెట్టాల్సిన బంగారంతో పాటు 2 ఫోటోలు, కేవైసీ పత్రాలతో బ్రాంచ్‌కు వెళ్లాలి. సంబంధిత లోన్ ఆప్లికేషన్ ఫాంలో సంతకం చేయాలి. బ్యాంకు సిబ్బంది బంగారాన్ని నిర్ధారించిన తరువాత బంగారం విలువను బట్టి బ్యాంకు రుణాలను అందిస్తుంది.(ఫ్రతీకాత్మక చిత్రం)