1. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ విప్లవంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ది (UPI) కీలకపాత్ర. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు క్షణాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి యూపీఐ పేమెంట్ పద్ధతి ఉపయోగపడుతోంది. అయితే ప్రస్తుతం డెబిట్ కార్డ్ (Debit Card) ఉన్నవారికే యూపీఐ సేవలు లభిస్తున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల్ని పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో ముందడుగు వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆధార్ ఓటీపీ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని బ్యాంకుల్ని కోరింది. అంటే డెబిట్ కార్డ్ అవసరం లేకుండా ఆధార్ కార్డ్ ఓటీపీ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేయొచ్చు. దీని వల్ల డెబిట్ కార్డ్ లేనివాళ్లు కూడా యూపీఐ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఫలితంగా డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ఎవరైనా తమ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి యూపీఐ యాక్టివేట్ చేయాలంటే తప్పనిసరిగా ఏటీఎం కార్డ్ ఉండాలి. తమ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నెంబర్, ఏటీఎం కార్డులో చివరి ఆరు అంకెలు ఉంటే చాలు. యూపీఐ యాక్టివేట్ చేయొచ్చు. యూపీఐ పిన్ జనరేట్ చేయాలన్నా, మార్చాలన్నా ఏటీఎం కార్డులో చివరి ఆరు అంకెలు తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
4. దీనివల్ల ఏటీఎం కార్డులు లేనివాళ్లు యూపీఏ పేమెంట్స్ చేయలేకపోతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త విధానంతో డెబిట్ కార్డ్ లేనివాళ్లు, ఏటీఎం కార్డ్ యాక్టీవ్‌గా లేనివాళ్లు కూడా యూపీఐ ప్లాట్ఫామ్లో చేరొచ్చు. యూపీఐ పిన్ మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ ఉంటే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆధార్ కార్డ్ ఓటీపీ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేయడం సాధ్యమవుతుంది. 2022 మార్చి 15 నుంచి ఇది అమలు చేయాలని ఇప్పటికే NPCI బ్యాంకుల్ని కోరింది. ఇందుకోసం NPCI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాతో (UIDAI) చేతులు కలిపింది. యూఐడీఏఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఆధార్ ఓటీపీ వేలిడేషన్ జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం ఈ ప్రాసెస్ ఎన్పీసీఐ సిస్టమ్స్, బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ల దగ్గర ప్రాసెస్‌లో ఉందని, పూర్తి స్థాయిలో ఈ విధానం అమలు కావడానికి 9 నెలల నుంచి 12 నెలల సమయం పట్టొచ్చని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరి దగ్గర ఆధార్ నెంబర్ ఉండటంతో, ఆధార్ ఓటీపీ ద్వారా యూపీఐ ప్లాట్ఫామ్లో చేరడం సులువవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఈ ఫీచర్ వాడుకోవడానికి మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉండాల్సిన అవసరం లేదు. UIDAI దగ్గర ఉన్న మీ ఆధార్ డేటాతో యూపీఐ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత యూపీఐ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)