1. మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? తరచూ పాస్‌బుక్ చెక్ చేస్తుంటారా? ఇటీవల టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను వెబ్సైట్లో చెక్ చేసుకుంటున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. చాలామంది ఉద్యోగం మానేసిన తర్వాత అసలు తమ ఈపీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోరు. అందులో డబ్బులు ఉన్నాయన్న సంగతి కూడా గుర్తుండదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చన్న విషయం కూడా తెలియదు. దీంతో పాత అకౌంట్లోనే డబ్బులు ఉండిపోతాయి. తమకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందన్న విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడంతో ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ చనిపోయిన తర్వాత వారి అకౌంట్లోని డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇలా ఈపీఎఫ్ అకౌంట్లు మాత్రమే కాదు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇన్స్యూరెన్స్ కంపెనీల దగ్గర ఖాతాదారులు క్లెయిమ్ చేసుకోని డబ్బు వేల కోట్లు ఉంది. ఇలా క్లెయిమ్ చేసుకోని డబ్బును తిరిగి ప్రజలకే ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)