1. NEFT: ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవారికి కొద్ది రోజుల క్రితం గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్-NEFT ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్‌పై ఛార్జీలను ఎత్తివేయాలని బ్యాంకుల్ని ఆదేశించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కస్టమర్లకు 2020 జనవరి 1 నుంచి నెఫ్ట్ లావాదేవీలను ఉచితంగానే అందించాలని ఆర్బీఐ బ్యాంకుల్ని కోరింది. జనవరి 1 నుంచి నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలేవీ ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
2. SBI ATM Withdrawal: ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జనవరి 1 నుంచి ఎస్బీఐ ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్వర్డ్-OTP తప్పనిసరి. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ నియమం వర్తిస్తుంది. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్బీఐ. అంటే మీరు డబ్బులు డ్రా చేయాలంటే మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. SBI ATM Card: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI పాత కార్డుల్ని తొలగిస్తోంది. గతంలో మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులను కస్టమర్లకు ఇచ్చాయి బ్యాంకులు. ఆ తర్వాత ఈఎంవీ చిప్ ఉన్న కార్డుల్ని మాత్రమే ఇస్తున్నాయి. అయితే ఇప్పటికీ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డుల్ని వాడుతున్నవారున్నారు. వారందర్నీ డిసెంబర్ 31 లోగా కార్డులు మార్చుకోవాలని బ్యాంకు కోరింది. జనవరి 1 నుంచి పాతకార్డులు పనిచేయవు. (ప్రతీకాత్మక చిత్రం)