1. జూన్ 1 నుంచి థర్డ్ పార్టీ మోటార్ ఇన్స్యూరెన్స్ (Third Part Insurance) ప్రీమియం పెరగబోతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి కొత్త టూవీలర్, ఫోర్ వీలర్, ఎలక్ట్రిక్ వెహికిల్ భారం కానుంది. అన్ని కేటగిరీలకు ఇది వర్తిస్తుంది. సవరించిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం (Insurance Premium) వివరాలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీతో సంప్రదింపులు జరిపి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇలా ప్రీమియం వివరాలను వెల్లడించడం ఇదే మొదటిసారి. వాహనదారులకు జూన్ 1 నుంచి కార్లు, టూ వీలర్ల ఇన్స్యూరెన్స్ మరింత భారం కానుంది. కరోనా వైరస్ మహమ్మారి కన్నా ముందు నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా 2019-2020 లో మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం సవరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 1,000 సీసీ ఇంజిన్ కెపాసిటీ లోపు ప్రైవేట్ కార్లకు రూ.2,094 ఇన్స్యూరెన్స్ చెల్లించాలి. 2019-2020 నుంచి ఇది రూ.2,072 ఉండేది. ఇక 1,000 సీసీ నుంచి 1,500 సీసీ మధ్య ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రైవేట్ కార్లకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం రూ.3,221 నుంచి రూ.3,416 కి పెరిగింది. అయితే 1,500 సీసీ దాటిన కార్ల ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890 కి తగ్గడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక టూవీలర్ల విషయానికి వస్తే 75 సీసీ లోపు టూవీలర్లకు రూ.538 ప్రీమియం, 75 సీసీ నుంచి 150 సీసీ టూవీలర్లకు రూ.714 ప్రీమియం, 150 సీసీ నుంచి 350 సీసీ టూవీలర్లకు రూ.1,366 ప్రీమియం, 350 సీసీ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న టూవీలర్లకు రూ.2,804 ప్రీమియం చెల్లించాలి. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఇన్సూరెన్స్ ప్రీమియంపై 7.5 శాతం డిస్కౌంట్ ప్రకటించింది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక 30KW కెపాసిటీలోపు ఉన్న ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు రూ.1,780 ప్రీమియం, 30KW నుంచి 65KW కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు రూ.2,904 ప్రీమియం వర్తిస్తుంది. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే రోడ్డు ప్రమాదం కారణంగా ఎవరికైనా వ్యక్తులు గాయాలపాలైతే కవరేజీ లభిస్తుంది. కాబట్టి వాహనదారులు సొంత డ్యామేజీ కవరేజీతో పాటు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)