* రూ.7 లక్షల వరకు నో ట్యాక్స్ : ఇప్పుడు ఐటీ రిటర్న్ ఫైల్ చేసే సమయంలో కొత్త ఆదాయ పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. పాత పన్ను విధానంలో ఉన్నవారు ఎప్పటిలాగానే అందులో పొందుతున్న రాయితీలు కొనసాగించవచ్చు. కావాలనుకుంటే కొత్త పన్ను పరిధిలోకి కూడా రావచ్చు. కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్‌ల సంఖ్యను ఐదుకి తగ్గించారు.
ప్రస్తుతం ఇండివిడ్యువల్స్ రూ.5 లక్షల వరకు కొత్త, పాత పన్ను విధానాలలో రిబేట్ (Rebate) కారణంగా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే తాజా బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్లకు రాయితీని పెంచాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. తద్వారా మొత్తం ఆదాయం 7 లక్షల రూపాయల వరకు ఉన్నవారు వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు.
ఆపై రూ.2.5-రూ. 5 లక్షల మధ్య ఆదాయంపై 5% పన్ను, రూ.5-7.5 లక్షల వరకు 10%, రూ.7.5-రూ. 10 లక్షల వరకు 15%, రూ.10-రూ.12.5 లక్షల వరకు 20%, రూ.12.5 రూ.15 లక్షల వరకు 25%, రూ.15 లక్షలకు పైగా ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం అధిక పన్ను భారాన్ని కలిగిస్తుంది. అందువల్ల కొత్త పన్ను విధానంలో మార్పులు చేశారు. బడ్జెట్ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐదు స్లాబ్‌లు అమలులోకి వస్తాయి.
* స్టాండర్డ్ డిడక్షన్ పెంపు : 2023 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ వార్షిక స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.52,500కి పెంచారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది పన్ను విధించని బేస్ అమౌంట్ కాగా ఇది పన్ను చెల్లింపుదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది రాయితీ (Rebate)కి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ట్యాక్స్ డిడక్షన్లను ఇన్కమ్ నుంచి క్లెయిమ్ చేయవచ్చు. అయితే పన్ను రాయితీలు చెల్లించవలసిన పన్ను (Payable Tax) నుంచి క్లెయిమ్ చేయవచ్చు.