దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,25,726గా ఉంది. మెరుగైన పనితీరు, సూపర్ డిజైన్‌తో కంపెనీ ఈ కొత్త బైక్‌ను తీసుకువచ్చింది. ఈ కొత్త అప్డేటెడ్ వెర్షన్లో బీఎస్ 6 200 సీసీ 4 వాల్వ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పవర్ 19 హెచ్‌పీ, 17.3 ఎన్ఎం టార్క్‌గా ఉంది. గత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త బైక్‌లో పవర్ 6 శాతం మేర పెరిగింది. అలాగే టార్క్ కూడా 5 శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు.
మీరు కంపెనీ వెబ్సైట్లోకి రూ. 2,500తో ఈ బైక్‌ను ప్రి బుకింగ్ చేసుకోవచ్చు. కాగా మరోవైపు బజాజ్ కూడా కొత్త బైక్ మార్కెట్లోకి తెచ్చింది. 110 సీసీ ఇంజిన్‌తో ప్లాటినా బైక్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఏబీఎస్ ఫీచర్ కూడా ఉంది. ఈ విభాగంలో ఈ ఫీచర్‌తో మార్కెట్లోకి వచ్చిన తొలి బైక్‌గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఇకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. వీటిపై పలు రకాల ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.