1. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ (GST Council) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో అనేక వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) పెంచడం లేదా కొత్త ప్రొడక్ట్స్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో ప్రజలకు వాత తప్పదు. కొత్త జీఎస్టీ జూలై 18న అమలులోకి రాబోతోంది. దీంతో జూలై 18 నుంచి పలు వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ మాంసం, చేపలు, తేనే, ఎండిన చిక్కుడు గింజలు, ఎండిన మఖానా, గోధుమలు, ఇతర ధాన్యాలు, గోధుమ పిండి, మెస్లిన్ పిండి, బెల్లం, మురమురాలు, సేంద్రీయ ఎరువులు, కొబ్బరి కాంపోస్ట్ లాంటివాటికి గతంలో జీఎస్టీ మినహాయింపు ఉండేది. ఇకపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఆస్పత్రిలో రోజుకు రూ.5,000 పైన అద్దె ఉంటే 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. సోలార్ వాటర్ హీటర్, సిస్టమ్, ప్రిపేర్డ్, ఫినిష్డ్ లెదర్, స్కిన్, లెదర్ గూడ్స్, ఫుట్‌వేర్, మట్టి ఇటుకలు, ఇ-వేస్ట్, పెట్రోలియం, కోల్ బెడ్ మిథేన్‌పై జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. హోటల్లో రూ.1,000 లోపు గదులకు 12 శాతం జీఎస్టీ చెల్లించాలి. మ్యాప్స్, చార్ట్స్, అట్లాస్ లాంటి వాటికీ 12 శాతం జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్, కత్తులు, పెన్సిల్ షార్పెనర్స్, బ్లేడ్లు, ఫోర్క్స్, స్పూన్స్, సెంట్రిఫ్యుగల్ పంప్స్, డీప్ ట్యూబ్ వెల్ టర్బైన్ పంప్స్, సబ్మెర్సిబుల్ పంప్స్, బైస్కిల్ పంప్స్, వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, గుడ్లను శుభ్రపర్చేందుకు ఉపయోగించే యంత్రాలు, డెయిరీ పరిశ్రమలో వాడే మెషీన్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎల్ఈడీ బల్బులు, లైట్లు, ఇతర పరికరాలు, మెటల్ ప్రింటెడ్ సర్క్యుట్ బోర్డులు, రోడ్లు, బ్రిడ్జీలు, మెట్రో, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, క్రిమెటేరియం పనులు, టెట్రా ప్యాక్‌లపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. క్లీనింగ్, సార్టింగ్, గ్రేడింగ్, విత్తనాలు, ధాన్యాల కోసం ఉపయోగించే యంత్రాలు, మిల్లింగ్ పరిశ్రమలో వాడే యంత్రాలు, వెట్ గ్రైండర్ లాంటి వాటిపై జీఎస్టీ ఏకంగా 5 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. బ్యాంకులు జారీ చేసే చెక్ బుక్స్‌పై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఆర్థోపెడిక్ అప్లయెన్సెస్, ఆస్టోమీ అప్లయెన్సెస్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. రోప్‌వేల ద్వారా వస్తువులు, ప్రయాణికుల రవాణాపై 18 శాతంగా ఉన్న జీఎస్టీ 5 శాతానికి తగ్గింది. ట్రక్కులు, గూడ్స్ క్యారేజీలను అద్దెకు తీసుకుంటే జీఎస్టీ 18 శాతం బదులు 12 శాతం చెల్లించాలి. ప్రైవేట్ సంస్థలు ఇంపోర్ట్ చేసుకునే డిఫెన్స్ వస్తువులు భద్రతా దళాలకు సరఫరా చేస్తే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)