e-Scooter | మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తక్కువ ధరలోనే ప్రీమియం డిజైన్ అదిరే ఫీచర్లతో ఇస్కూటర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మీకోసం అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలోనే సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనొచ్చు.
ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 225 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. అలాగే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు. అంటే ఈ స్కూటర్ రేంజ్ ఎక్కువనే చెప్పుకోవాలి. స్కూటర్ రన్నింగ్ కాస్ట్ విషయానికి వస్తే.. కిలోమీటరుకు 10 నుంచి 15 పైసలు ఖర్చు అవుతుందని కంపెనీ పేర్కొంటోంది.