1. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. నావి ఏఎంసీ నుంచి సరికొత్త మ్యూచువల్ ఫండ్ వచ్చేసింది. నావి ఏఎంసీ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ప్రకటించింది. నావి నిఫ్టీ నెక్స్ట్ 50 ఫండ్ (Navi Nifty Next 50 Fund) పేరుతో ఈ ఫండ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. ఈ సబ్స్క్రిప్షన్ జనవరి 15న ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ స్కీమ్‌లో చేరాలనుకునేవారు అంతలోపు న్యూ ఫండ్ ఆఫర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.10 ఫేస్ వ్యాల్యూతో కొనొచ్చు. ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయనివారికే జనవరి 21 మ్యూచువల్ ఫండ్ అందుబాటులోకి వస్తుంది. ఈ స్కీమ్‌లో నెలకు రూ.500 చొప్పు సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేవలం నిఫ్టీ 50 లో ఇన్వెస్ట్ చేయడం కన్నా నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 50లో కలిపి ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని కంపెనీ చెబుతోంది. నిఫ్టీ 50 లో ఉన్న లార్జ్ క్యాప్ కంపెనీల తర్వాత ఉన్న 50 కంపెనీలు నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్‌లో ఉంటాయి. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే రేపటి బ్లూచిప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ మార్కెట్లోనే అతితక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉండటం విశేషం. డైరెక్ట్ ప్లాన్‌కు ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.12% శాతం మాత్రమే. ప్యాసీవ్ ఫండ్స్ కేటగిరీలో ఇలాంటి స్కీమ్స్ అన్నింటితో పోలిస్తే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న ఫండ్ ఇదే. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటే రిటర్న్స్ బాగా వస్తాయని తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
5. గతేడాది జూలైలో నావి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ (Navi Nifty Next 50 Fund) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఫండ్ ద్వారా నావి రూ.100 కోట్లు సేకరించింది. ఇప్పుడు నావి నిఫ్టీ నెక్స్ట్ 50 ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇందులోని కంపెనీలను ఫ్యూచర్ నిఫ్టీ 50 కంపెనీలుగా భావిస్తారు. నిఫ్టీ 50 ఇండెక్స్ CAGR వివరాలు చూస్తే ఒక ఏడాదిలో 57.7 శాతం, ఐదేళ్లలో 14.4 శాతం, పదేళ్లలో 17.1 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఫ్లిప్‌కార్ట్ కో-ఫౌండర్ సచిన్ బన్సాల్ నావి పేరుతో ఇన్స్యూరెన్స్, లోన్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. నావి నుంచి వచ్చిన మరో మ్యూచువల్ పండ్ ఇది. అయితే ఏ మ్యూచువల్ ఫండ్‌లో అయినా ఇన్వెస్ట్ చేసేముందు ఇన్వెస్టర్లు ఆ స్కీమ్ వివరాలన్నీ ఓసారి చెక్ చేయాలి. స్కీమ్ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)