కాగా మరోవైపు ఉత్తర ప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీని ప్రోత్సహించడనాకి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులను ప్రోత్సహించడానికి 20 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని యోచిస్తోంది. దక్షిణాసియా, అమెరికా దేశాలకు వీటిని ఎగుమతి చేయాలని భావిస్తోంది. దీని కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 వేల ఎకరాల భూమిని కేటాయించే అవకాశం ఉంది.