నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) అనేది కాంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. సబ్స్క్రైబర్లు భవిష్యత్తులో అనుకోకుండా ఎదురయ్యే అవసరాలను తీర్చుకునేందుకు ఈ స్కీమ్ ఆర్థిక భరోసా ఇస్తుంది. రిటైర్మెంట్ కోసం క్రమబద్ధంగా పొదుపు చేసే అవకాశం కల్పిస్తుంది. భారత ప్రభుత్వం 2004లో పెన్షన్ రంగ సంస్కరణల్లో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టింది. అయితే ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఎన్పీఎస్ స్కీమ్‌లో ఇండివిడ్యువల్ నుంచి ఫండ్స్‌ను సేకరించి పెన్షన్ ఫండ్ క్రియేట్ చేస్తారు. ఈ ఫండ్స్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) కింద ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ డిబెంచర్లు, ఈక్విటీలు వంటి విభిన్న పోర్ట్‌ఫోలియోలలో పెట్టుబడి పెడతారు.
* ఎలా పని చేస్తుంది? : డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకారం.. ఎన్‌పీఎస్‌ని అన్‌బండిల్ ఆర్కిటెక్చర్ ద్వారా నిర్వహిస్తారు. ఫ్రేమ్‌వర్క్‌లో PFRDA పెన్షన్ ఫండ్స్, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్(PoP), కస్టోడియన్లు, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ(CRA), నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్, ట్రస్టీ బ్యాంక్, యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్ (ASP) నియమించిన మధ్యవర్తులు ఉంటారు.
అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో మినిమం కాంట్రిబ్యూషన్ రూ.500. యాక్టివ్ టైర్-I అకౌంట్ ఉన్న సబ్‌స్క్రైబర్ మాత్రమే టైర్-II అకౌంట్‌ను ఓపెన్ చేయగలరు. టైర్-II అకౌంట్ విషయంలో, అకౌంట్ హోల్డర్ అవసరాలకు అనుగుణంగా ఫండ్స్ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో మినిమం కాంట్రిబ్యూషన్ రూ.1,000 ఉండాలి.
* పన్ను ప్రయోజనాలు : ఎన్పీఎస్ స్కీమ్‌లో టైర్-I అకౌంట్ హోల్డర్స్‌కు మాత్రమే పన్ను ప్రయోజనాలు ఉంటాయి. సెక్షన్ 80 CCD (1) కింద రూ.1.50 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్‌కి అర్హులు. సెక్షన్ 80CCD 1(B) కింద ఎన్‌పీఎస్‌కి చేసిన కాంట్రిబ్యూషన్లపై రూ.50,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80CCD (2) ప్రకారం యజమాని కాంట్రిబ్యూషన్లు కూడా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ఈ రాయితీ సెక్షన్ 80C కింద నిర్దేశించిన లిమిట్ కంటే ఎక్కువగా ఉంటుంది.