ఇంకా ట్రేడ్ యూనియన్లపై దాడులు పెరుగుతుండటంతో పాటు ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రతపై భంగం కలుగుతోందని ఏఐబీఈఏ ఆరోపిస్తోంది. ద్వైపాక్షిక సెటిల్మెంట్ ఐ.డి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చెబుతోంది. సెటిల్ మెంట్లను ఉల్లంఘించి బదిలీల ద్వారా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. అందుకే దేశ వ్యాప్త బ్యాంకుల స్ట్రైక్‌కు పిలుపు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ రోజు జరగాల్సిన దేశ వ్యాప్త సమ్మె వాయిదా పడింది.