నష్టభయం తక్కువగా ఉండే పెట్టుబడుల్లో మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) ప్రధానమైనవి. మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉన్నా, వీటిపై ఉండే రిస్క్ స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్‌ను అందిస్తాయి. డివిడెండ్ ఈల్డ్ (Dividend Yield) ప్లాన్స్ అనేవి వీటిలో ఒకటి. ఎకానమీ, మార్కెట్ల మాక్రో ట్రెండ్స్ గురించి అవగాహన ఉన్న పెట్టుబడిదారులకు ఈ డివిడెండ్ ఈల్డ్ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇటువంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు తక్కువ వ్యవధిలో ఎక్కువ రాబడి కోసం సెలెక్టివ్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్ ఈల్డ్ ప్లాన్లలో IDBI డివిడెండ్ ఈల్డ్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్-గ్రోత్ ప్లాన్ ఒకటి. గత మూడు సంవత్సరాలలో ఈ మ్యూచువల్ ఫండ్ ప్లాన్.. దాని పెట్టుబడిదారులకు (వన్ టైమ్ డిపాజిటర్లు, SIP ఇన్వెస్టర్స్) భారీ రాబడిని అందించింది. (ప్రతీకాత్మక చిత్రం)
మ్యూచువల్ ఫండ్స్ SIP రిటర్న్
IDBI డివిడెండ్ ఈల్డ్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్-గ్రోత్ ప్లాన్ తన SIP ఇన్వెస్టర్లకు గత సంవత్సరంలో 12.90 శాతం రాబడిని అందించింది. ఈ మ్యూచువల్ ఫండ్ ప్లాన్ ద్వారా ఈ టైమ్ పీరియడ్‌లో వచ్చిన అబ్జల్యూట్ రిటర్న్ దాదాపు 6.85 శాతం. అదేవిధంగా గత రెండేళ్లలో ఈ ప్లాన్ 26.35 శాతం యాన్యువల్ రిటర్న్ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
* మ్యూచువల్ ఫండ్ SIP క్యాలిక్యులేటర్
ఒక పెట్టుబడిదారుడు ఈ మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌లో ఒక సంవత్సరం క్రితం రూ. 10,000 చొప్పున SIP ప్రారంభించినట్లయితే, వారి రూ. 10,000 నెలవారీ SIP ఈరోజు రూ.1.27 లక్షలకు పెరిగేది. ఒక పెట్టుబడిదారుడు 2 సంవత్సరాల క్రితం ఈ ప్లాన్‌లో రూ.10,000 నెలవారీ SIP ప్రారంభించినట్లయితే, అతని రూ.10,000 నెలవారీ SIP ఈరోజు రూ.3.09 లక్షలకు పెరిగేది. (ప్రతీకాత్మక చిత్రం)
* ఫండ్ ప్రత్యేకతలు
IDBI డివిడెండ్ ఈల్డ్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్-గ్రోత్ ప్లాన్ ఇండియన్ ఈక్విటీలలో 98.53 శాతం పెట్టుబడిని కలిగి ఉంది. వీటిలో 63.04 శాతం లార్జ్ క్యాప్ స్టాక్‌లలో ఉంది. 18.41 శాతం మిడ్ క్యాప్ స్టాక్‌లలో ఉంది. మిగిలిన 17.08 శాతం పెట్టుబడి స్మాల్- క్యాప్ స్టాక్స్‌లో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)