1. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ పెరుగుదల, తరుగుదలతో సంబంధమే లేదు. ఎందుకంటే ఎక్స్ అనే షేరును మార్కెట్ ర్యాలీలో సిప్ ద్వారా రూ.100కు కొనుగోలు చేస్తారు. అదే షేరును దిద్దుబాటులో రూ.80–70కు కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు సగటు అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కనుక వీటి రాబడుల్లో ఎక్కువ స్థిరత్వం ఉంటుందని ఆశించొచ్చు. ఈ విభాగంలో యాక్సిస్ ఫోకస్డ్ 25 మ్యూచువల్ ఫండ్ పథకం మంచి పనితీరుతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 15 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 18 శాతం, ఐదేళ్ల కాలంలో 17 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకం సొంతం. మూడేళ్లు అంతకుమించిన కాలాల్లో బెంచ్ మార్క్ పనితీరు కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. బోటమ్ అప్ విధానాన్ని స్టాక్స్ ఎంపికకు పాటిస్తుంది. స్థిరమైన, అధిక నాణ్యతతో కూడిన వ్యాపారాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడుల్లో సగం మేర తక్కువ అస్థిరతలు కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకునే వ్యూహాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను గమనిస్తూ, రిస్క్ ఎక్కువగా ఉన్న విభాగం నుంచి తక్కువగా ఉండే విభాగానికి పెట్టుబడులను మళ్లించే వ్యూహాలను పాటిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)