1. మీ జీతం డబ్బుల్లోంచి కొంత మొత్తం పొదుపు చేయాలనుకుంటున్నారా? ప్రతీ నెల జీతం రాగానే కొంత సేవ్ చేసే ఆలోచనలో ఉన్నారా? పొదుపు పథకాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) మంచి రిటర్న్స్ ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది. కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పొదుపు చేసినవారు ఇప్పుడు మంచి సంపద కూడగట్టుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పుడు సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ప్రారంభించి భవిష్యత్తులో కోట్ల సంపద కూడబెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగపడతాయి. మీకు 50 ఏళ్ల వయస్సు వచ్చేనాటికి రూ.11 కోట్ల సంపద కూడబెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకు ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ప్రతీ నెలా క్రమం తప్పకుండా పొదపు చేస్తూ ఉండాలి. 15 x 15 x 15 రూల్ పాటించాలి. ఈ రూల్ ఏంటో, 50 ఏళ్ల వయస్సు వచ్చేనాటికి రూ.11 కోట్ల రిటర్న్స్ ఎలా పొందాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత ముందుగా పొదుపు మొదలుపెడితే అంత మంచిది. 25 ఏళ్ల వయస్సులో కొత్తగా ఉద్యోగంలో చేరినవారు అప్పుడే పొదుపు ప్లాన్ చేయాలి. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి నెలకు రూ.12,000 పొదుపు చేస్తారనుకుందాం. 25 ఏళ్లపాటు పొదుపు చేయాలి. సిప్ స్టెప్ అప్ 15 శాతం మెయింటైన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. అంటే ఏడాది కాగానే సిప్ రూ.12,000 + 15% అవుతుంది. ఇలా ప్రతీ ఏటా సిప్ 15 శాతం పెరిగేలా ప్లాన్ చేసుకోవాలి. మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే 15 శాతం రిటర్న్స్ వస్తాయి. ఇలా నెలకు రూ.12,000 సిప్, ప్రతీ ఏటా 15 శాతం సిప్ స్టెప్ అప్‌తో 25 ఏళ్ల పాటు పొదుపు చేస్తే రూ.11 కోట్ల రిటర్న్స్ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ రిస్కుతో కూడుకున్నది. మార్కెట్ పరిస్థితులను బట్టి రిటర్న్స్ ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో మార్కెట్లు పెరుగుతాయి తప్ప పడిపోవని హిస్టరీ చూస్తే తెలుస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మార్కెట్లు పెరుగుతాయని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడుల్ని పెట్టే పరిజ్ఞానం, సమయం లేనివాళ్లు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసేముందు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఫండ్ హౌజ్ గురించి తెలుసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసిన ఫండ్ గతంలో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూడాలి. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ కూడా చెక్ చేయాలి. ఆ ఫండ్ మేనేజర్ గతంలో నిర్వహించిన ఫండ్స్ పర్ఫామెన్స్ ఎలా ఉందో చూడాలి. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మొత్తం పొదుపును ఒకే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయకుండా వేర్వేరు ఫండ్స్ ఎంచుకోవాలి. ఒకే తరహా వేర్వేరు ఫండ్స్ ఎంచుకోవద్దు. అంటే రెండుమూడు స్మాల్ క్యాప్ ఫండ్స్, రెండుమూడు లార్జ్ క్యాప్ ఫండ్స్ సెలెక్ట్ చేయొద్దు. ఒక స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక లార్జ్ క్యాప్... ఇలా వేర్వేరు కాంబినేషన్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)