1. ఎప్పటికైనా కోటీశ్వరులు కావాలన్నది మీ కలా? ఇందుకోసం ఇప్పటినుంచే మీ పొదుపును ప్లాన్ చేద్దామనుకుంటున్నారా? ఆర్థిక క్రమశిక్షణ ఉంటే కోటీశ్వరులు కావడం కష్టమేమీ కాదు. అయితే అందుకు తగ్గట్టుగా మీ పెట్టుబడుల్ని (Investments) ప్లాన్ చేయాలి. దీర్ఘకాలం పొదుపు చేస్తూ పోతే కోటీశ్వరులు కావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా కోటీశ్వరులు కావడానికి ఏం చేయాలో తెలుసుకోండి. మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే ఒకేసారి పెట్టుబడి పెట్టొచ్చు. లేదంటే ప్రతీ నెలా మీ జీతంలో కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేయాలి. మార్కెట్లో వందల సంఖ్యలో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. గతంలో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయి, ఫండ్ మేనేజ్ చేసే మేనేజర్ల ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఎగ్జిట్ లోడ్ ఎంత, ఛార్జీలు ఎంత చెల్లించాలి లాంటి వివరాలన్నీ తెలుసుకోవాలి. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మ్యూచువల్ ఫండ్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేయడం ద్వారా కోటి రూపాయల సంపద కూడబెట్టడం సులువే. ఇందుకోసం 15-15-15 రూల్ గుర్తుంచుకోవాలి. ప్రతీ నెలా రూ.15,000 చొప్పున 15 ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పొదుపు చేయాలి. మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకుంటే ఏటా 15 శాతం రిటర్న్స్ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీరు పొదుపు చేసే మొత్తం రూ.27 లక్షలు అయితే మీకు రూ.1 కోటి రిటర్న్స్ వస్తాయి. ఇదే పద్ధతిలో 25 ఏళ్లు పొదుపు చేస్తే మీరు పొదుపు చేసే మొత్తం రూ.45 లక్షలు అయితే మీకు రూ.4 కోట్లకు పైనే రిటర్న్స్ వస్తాయి. 30 ఏళ్ల పాటు పొదుపు చేస్తే మీరు పొదుపు చేసే మొత్తం రూ.54 లక్షలు అయితే మీకు రూ.10 కోట్ల రిటర్న్స్ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అయితే 30 ఏళ్ల పాటు పొదుపు చేసే వీలులేనివాళ్లు అంతకన్నా తక్కువ గడువే పొదుపు చేయొచ్చు. అయితే ఎంత ముందుగా పొదుపు మొదలుపెడితే అంత మంచిది. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ప్రతీ నెలా రూ.15,000 చొప్పున చేయాలనుకుంటే ప్రతీ ఏటా పెట్టుబడిని 15 శాతం చొప్పున పెంచాలి. ఇలా 25 ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేస్తే 12 శాతం వడ్డీ చొప్పున లెక్కేసినా మీకు రూ.10 కోట్లకు పైనే వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పైన చెప్పిన ఉదాహరణలు ఓ అంచనా మాత్రమే. సాధారణంగా మ్యూచువల్ ఫండ్‌లో రిటర్న్స్ ప్రతీ ఏటా 15 శాతం వస్తుంటాయని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. ఈ రిటర్న్స్ తక్కువగా ఉంటే మీకు వచ్చే మొత్తం తగ్గుతుంది. ఈ రిటర్న్స్ పెరిగితే భారీ మొత్తంలో సంపద కూడబెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్ అఢ్వైజర్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో ఫండ్స్ ఎంచుకోవడం ఉత్తమం. (ప్రతీకాత్మక చిత్రం)