ఏస్ ఈక్విటీ నుండి వచ్చిన డేటా ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 30 పెన్నీ స్టాక్‌లు ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. వీటిలో కొన్ని స్టాక్స్ గత ఐదు నెలల్లో 600 శాతానికి పైగా లాభపడినవే ఉన్నాయి. తక్కువ ధరకే లభించే ఈ పెన్సీ స్టాక్స్.. ఇన్వెస్టర్లకు ఊహించని విధంగా లాభాలు తీసుకొచ్చాయి. . (ప్రతీకాత్మక చిత్రం)
1. Kaiser Corporation: ప్రింటింగ్ సొల్యూషన్స్ కంపెనీ కైజర్ కార్పొరేషన్ స్టాక్ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 2,756.16 శాతం రాబడిని ఇచ్చింది. జనవరి 3న (2022లో మొదటి ట్రేడింగ్ రోజు) ఈ స్టాక్ రూ. 2.92 వద్ద ఉంది. కానీ ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ. 83.40కి పెరిగింది. అంటే కైజర్ కార్పొరేషన్ స్టాక్‌లో ఈ ఏడాది ఎవరైన రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ.28.56 లక్షలకి చేరేది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Alliance Integrated Metaliks Ltd: అలయన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్స్ లిమిటెడ్ షేర్లు ఈ ఏడాది రూ.2.84 నుంచి రూ.29.30కి పెరిగాయి. ఈ ఐదు నెలల కాలంలో అలయన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్స్ స్టాక్ 931.69% రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది ఈ షేర్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. ఇప్పుడు దాని విలువ రూ.10.31 లక్షలకు పెరిగేది. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) ప్రతీకాత్మక చిత్రం ( Image Credit: NSE, BSE websites)