2022 కొన్ని కంపెనీలకు బాగా కలిసి వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటినుంచి వాటి షేర్ విలువ భారీగా పెరిగింది. లైవ్ మింట్ కథనం ప్రకారం.. జనవరి-మార్చి 2022 కాలంలో పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందించిన 5 మల్టీబ్యాగర్ స్టాక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఏ కంపెనీల షేర్ వాల్యూ భారీగా పెరిగింది? ఇన్వెస్టర్లకు ఎంత లాభం ఇచ్చాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
1. సెజల్ గ్లాస్: 2022లో ఇప్పటివరకు ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ. 25.50 నుంచి రూ. 467.80 స్థాయికి పెరిగింది. ఈ మూడు నెలల్లో సెజల్ గ్లాస్ 1735 శాతం పెరిగింది. గత నెల రోజుల్లో ఈ కంపెనీ స్టాక్ అద్భుతంగా ర్యాలీ చేసింది. గత నెలలో ఈ స్టాక్ రూ. 175 నుంచి రూ. 467.80కి పెరిగింది. దాదాపు 165 శాతం రాబడిని ఇచ్చింది. 6 నెలల్లో ఇన్వెస్టర్లకు 3325 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.474 కోట్లు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కైజర్ కార్పొరేషన్ : ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 2022లో రూ. 2.92 నుంచి రూ. 54.50 స్థాయికి పెరిగింది. ఈ సమయంలో దీని విలువ 1765 శాతం పెరిగింది. గత నెల రోజుల్లోనే ఈ స్టాక్ 175 శాతం రాబడిని అందించగా.. గత 6 నెలల్లో 12,875 శాతం రాబడిని ఇచ్చింది. గత ఏడాదిలో కైజర్ కార్పొరేషన్ స్టాక్ రూ.0.38 నుంచి రూ.54.50కి పెరిగింది. గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 14,240 శాతం రాబడులను అందించింది. ఈ స్టాక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.286 కోట్లు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కటారే స్పిన్నింగ్ మిల్స్: 2022లో ఇప్పటివరకు ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ. 44.30 నుంచి రూ. 431 స్థాయికి పెరిగింది. ఈ మూడు నెలల్లో ఈ స్టాక్ ఏకంగా 870 శాతం పెరిగింది. గత నెల రోజుల వ్యవధిలో ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు 120 శాతం రాబడిని ఇచ్చింది. గత 6 నెలల్లో 2200 శాతం పెరిగింది. ఇక ఏడాది కాలంలో 3150 శాతం రాబడిని ఇచ్చింది. ప్రస్తుత స్టాక్ మార్కెట్ క్యాప్ రూ.122 కోట్లు. (ప్రతీకాత్మక చిత్రం)
4. హేమాంగ్ రిసోర్సెస్ : BSEలో లిస్ట్ అయిన ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 27.65ను తాకింది. 2022లో ఇప్పటివరకు 785 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ గత నెలలో 175 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత 6 నెలల్లో ఈ షేరు 670 శాతం లాభపడింది. ఒక సంవత్సరంలో 380 శాతం రాబడిని ఇచ్చింది. ప్రస్తుత స్టాక్ మార్కెట్ క్యాప్ రూ.36 కోట్లు. (ప్రతీకాత్మక చిత్రం)
5. శాంతి ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్: 2022లో ఇప్పటి వరకు ఈ స్టాక్ ఇప్పటివరకు 700 శాతం పెరిగింది. ఈ సమయంలో దీని విలువ రూ. 100 నుంచి రూ. 800 స్థాయికి పెరిగింది. గత నెలలో ఇన్వెస్టర్లకు 55 శాతం రాబడిని ఇచ్చింది. 6 నెలల్లో 740 శాతం లాభపడగా.. ఏడాది కాలంలో 440 శాతం పెరిగింది. ఈ స్టాక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.1,288 కోట్లు.