షేర్ మార్కెట్లో ఈ వారం కొన్ని స్టాక్స్ అదగొట్టాయి. ఈ కంపెనీల నుంచి జనాలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ దలాల్ స్ట్రీట్‌లో మాత్రం దుమ్మురేపాయి. ఇందులో పెట్టుబడిన పెట్టిన వారిని వారం రోజుల్లోనే ధనవంతులను చేశాయి. భారీగా లాభాలు తెచ్చిపోయాయి. ఈ వారంలో 35శాతానికి పైగా రాబడి తీసుకొచ్చి స్టాక్స్ ఇవే. (ప్రతీకాత్మక చిత్రం)
NRB ఇండస్ట్రియల్ బేరింగ్ లిమిటెడ్: NRB ఇండస్ట్రియల్ బేరింగ్ షేర్ వారంలో 57.44 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ గత వారంలో రూ.21.5 వద్ద ముగియగా, నిన్న శుక్రవారం మధ్యాహ్నం రూ.33.85 వద్ద ముగిసింది. BSEలో ట్రేడ్ అయ్యే ఈ స్టాక్‌లో గత వారం ఎవరైనా గత వారం రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఈ వారం చివరి నాటికి అతను రూ. 1,57,000 అయ్యి ఉండేవి. (ప్రతీకాత్మక చిత్రం)
నార్త్ ఈస్టర్న్ క్యారీయింగ్: ఈ వారం అధిక లాభాలు ఇచ్చిన స్టాక్స్‌లో నార్త్ ఈస్టర్న్ క్యారీయింగ్ స్టాక్ రెండో స్థానంలో ఉంది. ఇది వారంలో 50 శాతం రాబడిని ఇచ్చింది. నార్త్ ఈస్టర్న్ క్యారీయింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్ గత వారం రూ.23.9 వద్ద ముగియగా.. ఈ వారం రూ.35.85 వద్ద ముగిసింది. గత వారం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. లక్షా 50వేలు అయ్యేది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆటమ్ వాల్వ్స్ లిమిటెడ్: ఆటమ్ వాల్వ్స్ లిమిటెడ్ స్టాక్ కూడా ఈ వారం అద్భుతంగా ర్యాలీ చేసింది. వారంలో 42.57 శాతం రాబడిని ఇచ్చింది. ఆటమ్ వాల్వ్స్ లిమిటెడ్ స్టాక్ గత వారం రూ.55.55 వద్ద ముగియగా.. ఈసారి రూ.79.2 వద్ద ముగిసింది. గత వారం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ.1,42,000కి చేరేది. (ప్రతీకాత్మక చిత్రం )
సుప్రీం హోల్డింగ్ & హాస్పిటాలిటీ (ఇండియా) లిమిటెడ్: సుప్రీం హోల్డింగ్ & హాస్పిటాలిటీ షేరు గత వారం రూ.22.15 ఉండగా.. ఈ శుక్రవారం రూ. 30 వద్ద ముగిసింది. ఈ వారం రోజుల్లో 35.44 శాతం రాబడి తెచ్చింది. ఈ స్టాక్‌లో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే... ప్రస్తుతం దాని విలువ రూ. 1,35,000 అవుతుంది.ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. )(ప్రతీకాత్మక చిత్రం)