గత రెండేళ్లుగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. అలాంటి సమయంలో కూడా బిర్లా గ్రూప్ కంపెనీ అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఆ కంపెనీ పేరు Xproఇండియా. గత రెండేళ్లలో Xpro ఇండియా షేర్లు రూ.20 నుండి రూ.1072కి పెరిగాయి.ఈ కాలంలో కంపెనీ షేర్లు తమ పెట్టుబడిదారులకు దాదాపు 50 రెట్ల రాబడిని ఇచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఎవరైనా ఇన్వెస్టర్ 23 అక్టోబర్ 2020న కంపెనీ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి.. ఆ షేర్లను అలాగే ఉంచుకున్నట్లయితే... ప్రస్తుతం దాని విలువ రూ. 52 లక్షలు దాటేది. కనీసం 10 వేలు పెట్టుబడి పెట్టినా.. ఇప్పుడు 5 లక్షలపైగా రాబడి వచ్చేది. 2020లో ఒక షేర్‌కు 20 చొప్పున 50 షేర్లు కొని 1000 ఇన్వెస్ట్ చేసినా.. దాని విలువ రూ.52వేలకి చేరేది.(ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే.. Xpro ఇండియా షేర్లు 6360 శాతం రాబడిని అందించాయి. ఈ కంపెనీ షేర్లు 10 జనవరి 2003న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో రూ.15.73 స్థాయిలో ఉన్నాయి. 24 జూన్ 2022 నాటికి కంపెనీ షేర్లు రూ. 1072 స్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
వెటరన్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా Xpro ఇండియాలో ప్రధాన వాటాను కలిగి ఉన్నారు. ఇందులో 4,21,616 షేర్లు లేదా 3.57 శాతం వాటా ఉంది. ఎక్స్‌ప్రో ఇండియా షేర్లలో 52 వారాల గరిష్టం రూ.1674గా ఉండగా... 52 వారాల కనిష్ట ధర రూ.159.60గా ఉంది. రాబోయే రోజుల్లోనూ ఈ కంపెనీ షేర్లు బాగా ర్యాలీ చేయవచ్చని అంచనాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) (ప్రతీకాత్మక చిత్రం )