ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పరిస్థితి బాగా లేదు. కానీ ప్రతికూల వాతావరణంలో కూడా కొన్ని స్టాక్‌లు అద్భుతమైన రాబడిని ఇస్తున్నాయి. దీర్ఘకాలికంగా భారీ స్థాయిలో రాబడి ఇచ్చిన ఓ స్టాక్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. అది ఇన్వెస్టర్లపై డబ్బుల వర్షం కురిపిస్తోంది. గత కొన్నేళ్లలో 200000 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆ కంపెనీ పేరు బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Balkrishna Industries). ఇది టైర్లను తయారు చేస్తుంది. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌కి మార్కెట్లో మంచి పట్టుంది. అందుకే గత కొన్నేళ్లలో రూ. 1 నుంచి రూ. 2100 స్థాయి వరకు వృద్ధి సాధించింది. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి విలువ రూ. 2724.40 కాగా.. 52 వారాల కనిష్ట స్థాయి విలువ రూ. 1681.95గా నమోదయింది. (ప్రతీకాత్మక చిత్రం)
బాలకృష్ణ ఇండస్ట్రీస్ గత పదేళ్ల కాలంలో 17 రెట్లు ఎక్కువ డబ్బును సంపాదించింది. 2012లో ఒక పెట్టుబడిదారుడు ఈ కంపెనీ షేర్లలో రూ. లక్ష పెట్టుబడి పెట్టి తన పెట్టుబడిని అలాగే కొనసాగించినట్లయితే.. ప్రస్తుతం ఈ డబ్బు రూ.17.11 లక్షలుగా ఉండేది. ఇక గత 5 సంవత్సరాలలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 157 శాతం రాబడిని ఇచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) (ప్రతీకాత్మక చిత్రం )