స్టాక్ మార్కెట్లో స్థిరంగా మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చే కొన్ని స్టాక్‌లు ఉన్నాయి. గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు తెచ్చాయి. ఆ స్టాక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇవి ఒక సంవత్సర కాలంలో 192శాతానికి పైగా రాబడి ఇచ్చాయి. అంటే దాదాపు రెట్టింపు రిటర్న్స్ ఇచ్చాయన్న మాట. ఇవి ప్రముఖ పెట్టుబడిదారు ముకుల్ అగర్వాల్ పోర్ట్‌ఫోలియోలో కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఆల్కార్గో లాజిస్టిక్స్ (Allcargo Logistics): ఈ కంపెనీ భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ , రవాణా సేవలను అందిస్తుంది. అల్కార్గో లాజిస్టిక్స్ స్టాక్ ఒక సంవత్సరంలో 193 శాతం రాబడిని ఇచ్చింది. ఆరు నెలల్లో ఈ షేరు 31 శాతం లాభపడింది.బుధవారం మాత్రం స్వల్పంగా తగ్గింది. 0.21 శాతం నష్టంతో రూ.356 వద్ద ట్రేడవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
రేమండ్ (Raymond) : గత ఏడాది కాలంలో రేమండ్ స్టాక్ కూడా ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. ఐతే ఏప్రిల్ 27న స్వల్పంగా తగ్గింది. ఈ స్టాక్ BSEలో 2.53శాతం నష్టంతో రూ. 865 వద్ద ట్రేడ్ వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్ ఒక సంవత్సరంలో మల్టీబ్యాగర్లో 179.50 శాతం రాబడిని అందించగా.. గత ఆరు నెలల్లో 98 శాతం పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం )
శారదా ఎనర్జీ & మినరల్స్ (Sarda Energy & Minerals): క్యాప్టివ్ ఐరన్ ఓర్, స్టీల్ ప్రొడ్యూసర్ కంపెనీ శారదా ఎనర్జీ షేర్ .. ఏడాది కాలంలో 163 శాతం రాబడిని ఇచ్చింది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 50 శాతం లాభపడింది. 2022లో 58 శాతం రాబడిని ఇచ్చింది. బుధవారం ఏప్రిల్ 27న ఈ స్టాక్ ఇంట్రాడేలో బిఎస్ఇలో రూ. 1195.65 వద్ద ట్రేడవుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ (Shankara Building Products): హోమ్ ఇంప్రూవ్మెంట్, బిల్డింగ్ ప్రొడక్ట్స్ రిటైలర్ శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ స్టాక్ కూడా గత ఏడాది కాలంలో బాగా పెరిగింది. ఒక సంవత్సరంలో 103% రాబడిని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 38 శాతం లాభపడి.. ఇన్వెస్టర్లకు 47 శాతం లాభాన్ని అందించింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఆన్‌మొబైల్ గ్లోబల్ (OnMobile Global): ఈ టెలికమ్యూనికేషన్ కంపెనీ స్టాక్ కూడా ఏడాది కాలంలో 83 శాతం పెరిగింది. మంగళవారం ఏప్రిల్ 27న కూడా ఈ స్టాక్ ఇంట్రాడేలో రూ.174 వద్ద ట్రేడ్ అయింది. గత నెలలో ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు 61% రాబడిని ఇచ్చింది. 2022లో ఇప్పటి వరకు 73 శాతం లాభాన్ని ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. )(ప్రతీకాత్మక చిత్రం)