స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీలుంటాయి. వాటి స్టాక్ ధర ఏటేటా వృద్ధి సాధిస్తూ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తాయి. సామాన్యులను లక్షాధికారులు, కోటీశ్వరులను చేస్తుంటాయి. బాలాజీ అమీన్స్ కంపెనీ కూడా అలాంటిదే. గతంలో రూ.1.69గా ఉన్న ఈ కంపెనీ షేర్ విలువ.. ప్రస్తుతం ఇప్పుడు ఏకంగా రూ.3వేలు దాటేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
అక్టోబరు 19, 2001న ఈ కంపెనీ షేర్లలో ఎవరైనా రూ.లక్ష పెట్టుబడి పెట్టి.. దానిని అలాగే ఉంచుకుని ఉంటే.. ప్రస్తుతం దాని విలువ రూ.18 కోట్లకు చేరేది. అంటే అప్పట్లో ఎవరైనా లక్ష పెట్టుబడి పెడితే.. ఇప్పుడతను కోటీశ్వరుడయ్యే వారు. బాలాజీ అమీన్స్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.9,475 కోట్లకు చేరువలో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. )