తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఇచ్చే స్టాక్స్. వీటినే పెన్సీ స్టాక్స్‌గా పిలుస్తారు. ఇవి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తాయి. ఒక్కోసారి అవే బోల్తాకొట్టిస్తాయి. ఐనా వీటిలో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది మొగ్గుచూపుతారు. తగిలితే జాక్‌పాట్ వస్తుందని నమ్ముతారు. అలాంటి వాటిలో బీఎల్ఎస్ ఇన్ఫెటెక్ స్టాక్ ఒకటి. (ప్రతీకాత్మక చిత్రం)
జనవరి 3, 2022న 66 పైసల వద్ద ముగిసిన స్టాక్.. ఇప్పుడు ఏకంగా రూ.4.79కి పెరిగింది. అయితే గత నెల రోజులుగా ఈ స్టాక్‌లో అమ్మకాలు పెరగడం వల్ల షేర్ విలువ పడిపోయింది. ఇది 7 శాతానికి పైగా పడిపోయింది. కానీ ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. గత 5 ట్రేడింగ్ సెషన్లలో 20.65 శాతం రాబడిని ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2022 ప్రారంభంలో ఎవరైనా ఈ షేరును కొనుగోలు చేసి రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈరోజు దాని విలువ రూ.7.25 లక్షలకి చేరేది. BLS ఇన్ఫోటెక్.. ఐటీకి సంబంధించిన కంపెనీ. 1985లో ఏర్పాటయింది. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సేవలను అందిస్తోంది. ఈ పెన్నీ స్టాక్ అద్భుతమైన రాబడి ఇస్తుండడంతో చాలా మంది దీనివైపు మొగ్గుచూపుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. )ప్రతీకాత్మక చిత్రం