1. బండి తీసుకొని రోడ్డెక్కుతున్నారా? ఓవర్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌ని పెద్దగా పట్టించుకోవట్లేదా? జరిమానాలు కట్టేద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉంటున్నారా? జర జాగ్రత్త.
మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది. ఆ తర్వాత నిబంధనలు మారబోతున్నాయి. జరిమానాలూ పెరగబోతున్నాయి. ఈ బిల్లులోని కీలక అంశాలు ఇవే. (ప్రతీకాత్మక చిత్రం)
2. రోడ్డు భద్రత: వాహనదారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం... ట్రాఫిక్ నియమనిబంధనల్ని ఉల్లంఘించినవారిపై భారీగా జరిమానాలు విధించనుంది. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ఓవర్ లోడ్ లాంటి తప్పులకు జరిమానాలు భారీగా పెంచబోతోంది. ఈ జరిమానాలు రూ.2,000 నుంచి రూ.10,000 వరకు ఉండబోతున్నాయి. అంతేకాదు... ఈ జరిమానాలు ఏటా 10% పెరగబోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రమాదాల్లో సాయం చేసేవారికి భరోసా: సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ముందుకు రావడానికి సంకోచిస్తుంటారు ప్రజలు. పోలీసు కేసులు, ఇతర తలనొప్పులు ఉంటాయన్న భయం ఉంటుంది. ఇందుకోసం ఈ బిల్లులో కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించింది కేంద్రం. అత్యవసర సమయాల్లో వైద్యపరంగా, ఇతర పద్ధతుల్లో సాయం చేసినవారికి ఎలాంటి వేధింపులు ఎదురుకాకుండా కేంద్రం భరోసా ఇవ్వనుంది. అంతేకాదు... రోడ్డు ప్రమాదాల బాధితులకు గోల్డెన్ హవర్లో ఉచితంగా చికిత్స ఇవ్వాలన్న నిబంధనను చేర్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్: ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ విధానం సులభతరం కాబోతోంది. బీమా సంస్థలు నెల లోపే క్లెయిమ్ సెటిల్ చేయాలి. హిట్ అండ్ రన్ కేసులో చనిపోయినవారి కుటుంబాలకు కనీస పరిహారాన్ని రూ.25,000 నుంచి రూ.లక్షలకు పెంచింది. తీవ్రంగా గాయపడేవారికి పరిహారాన్ని రూ.12,500 నుంచి రూ.50,000 చేసింది. వాహన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షల పరిహారం లభిస్తుంది. వాహన యజమాని లేదా బీమా కంపెనీ ఈ పరిహారాన్ని అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్: ఇక ఆన్లైన్ లెర్నర్స్ లైసెన్స్ పొందొచ్చు. ఇందుకోసం ఆన్లైన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరి. నకిలీ డ్రైవింగ్ లైసెన్సులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది. లైసెన్స్ ల్యాప్స్ కావడానికి ఏడాది ముందు నుంచే రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ ట్రైనింగ్ స్కూళ్లనూ ఏర్పాటు చేయబోతోంది. వాహనాల రిజిస్ట్రేషన్ డీలర్ల దగ్గరే చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
10. ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తే ప్రస్తుత జరిమానా రూ.1,000 కాగా కొత్త జరిమానా రూ.5000 వరకు ఉంటుంది. డ్రంకెన్ డ్రైవింగ్‌కు ప్రస్తుత జరిమానా రూ.2000 కాగా కొత్త ఫైన్ రూ.10,000. రేసింగ్‌కు ప్రస్తుత జరిమానా రూ.500 కాగా కొత్త ఫైన్ రూ.5,000. మైనర్లకు బండి ఇస్తే వాహన యజమానిపై కేసు నమోదు కానుంది. దాంతో పాటు వాహన రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12. టూవీలర్‌పై ఓవర్ లోడింగ్‌కు ప్రస్తుత జరిమానా రూ.100 కాగా కొత్త ఫైన్ రూ.2,000. ఫైన్‌తో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు. ఇన్స్యూరెన్స్ లేకుండా డ్రైవింగ్‌కు ప్రస్తుత జరిమానా రూ.1,000 కాగా కొత్త ఫైన్ రూ.2,000. వాహనాల్లో ప్యాసింజర్లను ఎక్కువగా ఎక్కించుకుంటే అదనంగా ఉన్న ఒక్కో ప్యాసింజర్‌కు రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)