ఈ ఏడాది 40 శాతానికి పైగా వృద్ధి చెందే స్టాక్స్ ఇవే..
ఈ ఏడాది 40 శాతానికి పైగా వృద్ధి చెందే స్టాక్స్ ఇవే..
దేశంలోనే ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ 2020లో అసాధారణ వృద్ధి సాధించే స్టాక్స్‌ను ప్రకటించింది. దాదాపు 45-50 శాతం వృద్ధితో స్టాక్స్ మార్కెట్లను దున్నేస్తాయని తెలిపింది. అందులో ఎక్కువగా మధ్యస్థాయి, చిన్న స్థాయి కంపెనీలే ఉన్నాయని వెల్లడించింది. ఎలక్ట్రికల్ కంపెనీల్లో వోల్టాస్, క్రాంప్టన్ మంచి వృద్ధి సాధిస్తాయని వివరించింది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఏడాది 45 శాతం వృద్ధి సాధిస్తుంది. ఒక్కో షేరు విలువ రూ.15కు చేరుకుంటుది. (Image : Reuters)
2/ 12
యూనియన్ బ్యాంకు 2020లో 52 శాతం వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో షేరు విలువ రూ.80కి చేరే అవకాశం ఉంది. (Image : Reuters)
3/ 12
ఇండో స్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ కూడా 42 శాతం వృద్ధి సాధిస్తుందని ఈ బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఒక్కో షేరు విలువ రూ.270కి చేరుతుందని అంచనా. (Image : Reuters)
4/ 12
చిన్న స్థాయి కంపెనీ అయిన ఇంజనీర్స్ ఇండియా 44 శాతం వృద్ధి నమోదు చేస్తుంది. రూ.146గా షేరు విలువ చేరుతుందట. (Image : Reuters)
5/ 12
అశోకా బిల్డ్‌కాన్ కూడా 46 శాతం ఎదుగుదలను చూస్తుంది. దీని షేరు విలువ రూ.150కి చేరే అవకాశం ఉంది. (Image : Reuters)
6/ 12
సద్భావ్ ఇంజనీరింగ్ సంస్థ 48 శాతం వృద్ధ సాధించి నిర్మాణ రంగంలో దూసుకుపోతుందట. దీని షేరు విలువ రూ. 185కు చేరుతుందట. (Image : Reuters)
7/ 12
మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ అసాధారణంగా 53 శాతం వృద్ధితో షేరు విలువను రూ.42 దక్కించుకుంటుందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. (Image : Reuters)
8/ 12
క్యాస్ట్రల్ ఇండియా 46 శాతం జంప్ చేసి, రూ.185కు షేరు విలువ చేరుతుంది. (Image : Reuters)
9/ 12
మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం.. హెచ్‌పీసీఎల్ 54 శాతం వృద్ధి సాధిస్తుంది. దాని ఒక్కో షేరు విలువ రూ.388కి చేరే అవకాశం ఉందట. (Image : Reuters)
10/ 12
ఇండియన్ ఆయిల్ 51 శాతం ఎదుగుదలను సాధిస్తుందట. షేరు విలువ రూ.192కు చేరుతుంది. (Image : Reuters)
11/ 12
వొడాఫోన్ 46 శాతం వృద్ధి సాధించి షేరు విలువ రూ.8కు చేరుకుంటుంది. (Image : Reuters)
12/ 12
నవనీత్ ఎడ్యుకేషన్స్ స్టాక్ మార్కెట్లో జోరు పెంచుతుందని, 46 శాతం వృద్ధితో దాని షేరు విలువ రూ.139కి చేరే అవకాశం ఉందని ఈ బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. (Image : Reuters)