టాటా టియాగో ఈవీ అందుబాటు ధరకే లభిస్తోంది. దీని ధర రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్ట ధర రూ. 11.99 లక్షలుగా ఉంది. ఈ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్‌తో లభిస్తోంది. ఒకటేమో 19.2 కేడబ్ల్యూహెచ్ వేరియంట్. మరోటి ఏమో 24 కేడబ్ల్యూహెచ్ వేరియంట్. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ కారు 250 కి.మి. నుంచి 310 కి.మి వరకు వెళ్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 400 కూడా ఇటీవలనే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ. 15.9 లక్షల నుంచి ఉంది. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే. అదిరే లుక్ దీని సొంతం. ఇందులో 39.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ 456 కిలోమీటర్లు. కాగా పైన పేర్కొన్న ధరలు అన్నీ ఎక్స్‌షోరూమ్‌వి. అందువల్ల ఆన్ రోడ్ ధరల్లో మార్పులు ఉండొచ్చు. కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేేసే వారు ఈ మోడళ్లను ఒకసారి పరిశీలించొచ్చు.