1. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాల్సి ఉందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇచ్చిన మూడు నెలల మారటోరియం ఆప్షన్ వాడుకుందామనుకుంటున్నారా? మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే భారీగా నష్టపోవాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. ఎందుకంటే క్రెడిట్ కార్డుపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు మారటోరియం ఎంచుకుంటే 30 నుంచి 40 శాతం వడ్డీ చెల్లించక తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. మీరు మూడు నెలలు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని అనుకున్నా ఆ తర్వాత వడ్డీతో కలిపి బిల్లు ఎక్కువగా చెల్లించక తప్పదు. అసలు మీరు ఎంత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందో బ్యాంకులే వివరించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. వడ్డీ నెలకు రూ.3.5 శాతం అనుకుంటే మీరు చెల్లించాల్సిన వడ్డీ ఎంతో ఉదాహరణ చూడండి. మార్చి 3న చెల్లించాల్సిన క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.1,00,000 అనుకుందాం. ఏప్రిల్ 3 నాటికి వడ్డీ- రూ.3,500 అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. ఇలా మారటోరియం మూడు నెలలు కాబట్టి మూడు నెలలకు వడ్డీ పడుతుంది. మే 3 నాటికి మొత్తం వడ్డీ రూ.7,122, జూన్ 3 నాటికి మొత్తం వడ్డీ రూ.10,871 అవుతుంది. జూన్ 3న మీరు చెల్లించాల్సిన మొత్తం రూ.1,10,871. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. అంటే రూ.1,00,000 క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుండా మీరు మూడు నెలలు మారటోరియం ఎంచుకుంటే అదనంగా వడ్డీ రూ.10,871 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. ఇలాంటి ఉదాహరణే యాక్సిస్ బ్యాంకు కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 12న మీ క్రెడిట్ కార్డుతో ఖర్చు చేసిన మొత్తం రూ.10,000 అనుకుందాం. మీ బిల్ మార్చి 12న జనరేట్ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. ఏప్రిల్ 12 నాటికి క్రెడిట్ కార్డు డ్యూ రూ.10,000 ఉంటుంది. మారటోరియం ఎంచుకుంటే మీరు కట్టాల్సిన వడ్డీ+జీఎస్టీ రూ.1,739. అంటే 2020 జూన్ 12న మీరు చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లు రూ.11,739. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. అంటే రూ.10,000 బిల్లుకు మారటోరియం ఎంచుకుంటే మీరు రూ.11,739 చెల్లించాలి. అదనంగా మీరు రూ.1,739 చెల్లించాలన్నమాట. అందుకే మీ దగ్గర డబ్బులు ఉంటే క్రెడిట్ కార్డు బిల్లు తప్పని సరిగా చెల్లించాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)