2. అలాగని క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే డిఫాల్టర్ లిస్ట్‌లోకి వెళ్తారు. మళ్లీ అది కాస్తా క్రెడిట్ స్కోర్ పైనా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎప్పుడూ క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకుండా ఆపొద్దు. అయితే డబ్బులు లేనప్పుడు బిల్లులు చెల్లించడం ఎలా? ఈ సందేహం క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఉండటం మామూలే. ఇందుకు మీ ముందు 5 మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Balance Transfer: మీ క్రెడిట్ కార్డు బిల్లుల్ని చెల్లించడానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఓ మార్గం. మీ దగ్గర ఇంకో క్రెడిట్ కార్డు ఉంటే ఆ కార్డు నుంచి మీరు బిల్లు చెల్లించాలనుకునే కార్డుకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీని వల్ల మీరు గరిష్టంగా 90 రోజుల వరకు క్రెడిట్ ఫ్రీ పీరియడ్ వాడుకోవచ్చు. మీరు డబ్బులు అడ్జెస్ట్ చేసుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Snowball Technique: మీ క్రెడిట్ కార్డ్ బిల్లుల్ని చెల్లించేందుకు స్నోబాల్ టెక్నిక్ ఫాలో కావొచ్చు. మీకు బిల్లులు ఎక్కువగా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చెల్లిస్తూ భారాన్ని తగ్గించుకోవాలి. ముందు తక్కువ బిల్లు ఉన్న కార్డు పేమెంట్ క్లియర్ చేయాలి. ఆ తర్వాత ఎక్కువ బిల్లుపై దృష్టి పెట్టాలి. ఇలా ఒక కార్డుపై బిల్లు చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ కాస్త పెరుగుతుంది. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా ఎక్కువవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Personal Loan: తప్పదు అనుకుంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేందుకు పర్సనల్ లోన్ తీసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డుపై చెల్లించే వడ్డీ కన్నా పర్సనల్ లోన్ వడ్డీ చాలా తక్కువ. క్రెడిట్ కార్డుకు వడ్డీ చెల్లించడం కన్నా పర్సనల్ లోన్ తీసుకోవడమే మంచిది. అసలు క్రెడిట్ కార్డుపై ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. Investments: మీరు ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టైతే వాటిని లిక్విడేట్ చేసి క్రెడిట్ కార్డు బిల్లుల్ని చెల్లించండి. మీ ఇన్వెస్ట్మెంట్లపై వడ్డీ వస్తున్నా సరే తప్పనిపరిస్థితుల్లో ఈ ఆప్షన్ తప్పదు. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్లపై వచ్చే వడ్డీ కన్నా, క్రెడిట్ కార్డు వడ్డీ ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)