1. మీరు ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేసి భారీగా రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ (LIC Jeevan Umang) పాలసీ ద్వారా భారీగా రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. ఇది లైఫ్ ఇన్స్యూరెన్స్ (Life Insurance) ప్లాన్. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ ప్లాన్ తీసుకున్నవారి కుటుంబ సభ్యులకు ఇన్కమ్ ప్రొటెక్షన్ అందించే ప్లాన్ ఇది. ఈ పాలసీలో ప్రతీ రోజు కేవలం రూ.41 చొప్పున పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. మరి ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ వివరాలు, ఎవరు తీసుకోవచ్చు, ప్రతీ ఏటా ఎంత ప్రీమియం చెల్లించాలి అన్న వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ 90 రోజుల వయస్సు నుంచి 55 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారు తీసుకోవచ్చు. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఈ పాలసీ తీసుకోవచ్చు. మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీసం సమ్ అష్యూర్డ్ రూ.2,00,000 ఉండాలి. గరిష్ట పరిమితి లేదు. ప్రీమియం చెల్లించే కాలాన్ని కూడా పాలసీదారులు ఎంచుకోవచ్చు. 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్ల టర్మ్స్ ఎంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఉదాహరణకు ఓ వ్యక్తి 30 ఏళ్ల టర్మ్‌తో జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవాలంటే వారి వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. ప్రీమియం చెల్లించే టర్మ్ 70 ఏళ్లకు ముగుస్తుంది. ఒకవేళ 15 ఏళ్లకు పాలసీ తీసుకోవాలంటే 55 ఏళ్ల లోపు ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఈ పాలసీ తీసుకుంటే గరిష్టంగా 30 ఏళ్లు ప్రీమియం చెల్లించొచ్చు. అంటే 90 రోజుల వయస్సు ఉన్న పిల్లలకు ఈ పాలసీ తీసుకుంటే వారి వయస్సు 30 ఏళ్లు వచ్చేసరికి మంచి రిటర్న్స్ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.5,00,000 సమ్ అష్యూర్డ్, 75 ఏళ్ల పాలసీ టర్మ్‌తో జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకున్నారనుకుందాం. 30 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 75 ఏళ్ల వరకు పాలసీ వర్తిస్తుంది. 30 ఏళ్లపాటు ప్రతీ ఏటా రూ.14,758 ప్రీమియం చెల్లించాలి. అంటే రోజు రూ.41 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యక్తి 30 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అంటే అతని వయస్సు 55 వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. అతనికి 75 ఏళ్ల వయస్సు వచ్చేసరికి గరిష్టంగా రూ.63,08,250 రిటర్న్స్ లభిస్తాయని ఎల్ఐసీ వెబ్సైట్లో వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)