Petrol Price | కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించబోతోందా? పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు రెడీ అవుతోందా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్ తగ్గించనుందని తెలుస్తోంది. ఇదే జరిగితే వాహనదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఫ్యూయెల్ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి.
కాగా జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అప్పర్ టార్గెట్ లిమిట్ 6 శాతం కన్నా ఎక్కువగా నమోదు అయ్యింది. అక్టోబర్ నుంచి చూస్తే.. ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణ గణాంకాల తర్వాత కేంద్రం ఫ్యూయెల్పై ట్యాక్స్ తగ్గింపుపై ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.