LPG Subsidy: గ్యాస్ సిలిండర్ వాడే వారికి మోదీ భారీ శుభవార్త.. ఎల్పీజీ సబ్సిడీపై కీలక ప్రకటన!
LPG Subsidy: గ్యాస్ సిలిండర్ వాడే వారికి మోదీ భారీ శుభవార్త.. ఎల్పీజీ సబ్సిడీపై కీలక ప్రకటన!
LPG Cylinder | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ సబ్సిడీ మొత్తాన్ని మరో ఏడాది పాటు అందిస్తామని వెల్లడించింది.
Ujjwala Scheme | ఎల్పీజీ సిలిండర్ వాడే వారికి మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ అంశంపై ముఖ్య ప్రకటన చేసింది. దీంతో సిలిండర్ వాడే వారికి భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
2/ 10
కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీ మొత్తాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఫెసిలిటీ కేవలం కొందరికి మాత్రమే వర్తిస్తుంది. ఉజ్వల స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్న వారికి ఈ బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు.
3/ 10
ప్రధాన్ మంత్రి ఉజ్వల స్కీమ్ (పీఎంయూవై) స్కీమ్ కింద అందించే ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ మొత్తాన్న మరో ఏడాది పాటు పొడిగిస్తన్నట్లు కేంద్ర ప్రభుత్వ వెల్లడించింది. దీని వల్ల దాదాపు 9.6 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.
4/ 10
క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 14.2 కేజీల గ్యాస్ సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీ వస్తుంది. ఏడాదిలో 12 సిలిండర్లకు ఇది వర్తిస్తుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
5/ 10
2023 మార్చి 1 నాటికి చూస్తే.. ఉజ్వల స్కీమ్ కింద దాదాపు 9.59 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ రూ.200 సబ్సిడీ వల్ల 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వంపై రూ. 6,100 కోట్ల భారం పడిందని ఆయన తెలిపారు.
6/ 10
అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 7.680 మేర భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన కస్టమర్లకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడతాయి. ఇలా ప్రతి సిలిండర్ బుకింగ్‌కు రూ. 200 అకౌంట్లోకి వస్తాయి.
7/ 10
కాగా ఇటీవల కాలంలో ఉజ్వల స్కీమ్ కొంద ఎల్పీజీ సిలిండర్ వినియోగం పెరిగిందని కేంద్రం పేర్కొంటోంది. 2019-20 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి ఉజ్వల స్కీమ్ ఎల్పీజీ వినియోగం 20 శాతం మేర పెరిగిందని తెలిపింద.
8/ 10
కాగా భారత ప్రభుత్వం 2016లో ప్రధాన్ మంత్ర ఉజ్వల యోజన స్కీమ్‌ను తీసుకువచ్చింది. పేదలకు గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉండాలని ఈ పథకాన్ని లాంచ్ చేసింది. ఇది డిపాజిట్ ఫ్రీ ఎల్పీజీ కనెక్షన్. పేద మహిళలు ఈ కనెక్షన్ పొందొచ్చు.
9/ 10
ఇకపోతే దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిలిండర్ కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు ఏకంగా రూ. 1200 సమీపంలోకి చేరింది.
10/ 10
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. ఏపీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1161కు చేరింది. అదే తెలంగాణలో అయితే రూ. 1155 వద్ద ఉంది. వీటికి డెలివరీ చార్జీలు కలుపుకుంటే సిలిండర్ ధర దాదాపు రూ. 1200కు చేరిందని చెప్పుకోవచ్చు.