Aadhaar Ration Card Link: రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్రం అదిరే శుభవార్త.. కీలక ప్రకటన!
Aadhaar Ration Card Link: రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్రం అదిరే శుభవార్త.. కీలక ప్రకటన!
Aadhaar Card News | మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకు శుభవార్త. మీకు కేంద్రం తీపికబురు అందించింది. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి గడువు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Ration Card News | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు కలిగిన వారికి భారీ ఊరట కలిగించింది. ముఖ్య ప్రకటన చేసింది. దీని వల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.
2/ 10
మోదీ సర్కార్ తాజాగా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి గడువును పొడిగించింది. మరో మూడు నెలల గడువు ఇచ్చింది. అందువల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఇంకా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదంటే రేషన్ కార్డు చెల్లుబాటు కాకపోవచ్చు.
3/ 10
రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి సాధారణంగా మార్చి 31తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఈ డెడ్‌లైన్‌ను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించింది. అంటే మూడు నెలల గడువు పొడిగించింది.
4/ 10
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తాజాగా ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అందువల్ల ఇంకా ఎవరైనా ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ చేసుకోకపోతే.. ఈ పనిని వెంటనే పూర్తి చేసుకోండి.
5/ 10
రేషన్ కార్డును కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటిగా చెప్పుకుంటారు. పాస్ పోర్ట్, పాన్ కార్డు మాదిరిగా రేషన్ కార్డు కూడా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. దీని ద్వారా సబ్సిడీ రేటుకే బియ్యం, గోధుమలు వంటివి లభిస్తాయి.
6/ 10
అంతేకాకుండా రేషన్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. రేషన్ కార్డు కలిగిన వారు వారికి దగ్గరిలో ఉన్న రేషన్ స్టోర్‌కు వెళ్లి సబ్సిడీ రేటుకు సరుకులు పొందొచ్చు. కొన్ని సార్లు నూనె, చక్కెర, కందులు వంటివి కూడా అందజేస్తారు.
7/ 10
ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకోవడం ద్వారా రేషన్ కార్డు మోసాలకు చెక్ చెప్పొచ్చు. ఒకే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ కార్డుల ద్వారా రేషన్ పొందకుండా ఉండేందుకు ఆధార్ లింక్ ఉపయోగపడుతుంది.
8/ 10
డూప్లికేట్ రేషన్ కార్డులను గుర్తించడానికి ఆధార్ లింక్ చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. నిజంగా అర్హత కలిగిన వారికి మాత్రమే స్కీమ్ ప్రయోజనాలు అందుతాయి. అందుకే ఆధార్ రేషన్ కార్డు లింక్ తప్పనిసరి.
9/ 10
రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలని భావించే వారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) పోర్టల్‌కు వెళ్లాలి. అక్కడ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉండొచ్చు.
10/ 10
లేదంటే రేషన్ కార్డు, ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డుల జిరాక్స్‌లను, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటివి వాటిని రేషన్ ఆఫీస్‌కు లేదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా రేషన్ ఫాపుకు వెళ్లి అందిస్తే సరిపోతుంది.