మోసగాళ్లు ప్రజలను నమ్మించడానికి నాకు ప్రధాన్ మంత్రి జ్ఞానవీర్ స్కీమ్ కింద రూ. 3,400 వచ్చాయి, మీరు కూడా అప్లై చేసుకోండి అనే మెసేజ్‌ను షేర్ చేస్తున్నారు. కింద ఉన్న లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. అని మెసేజ్‌లో పేర్కొంటున్నారు. అయితే ఇదంతా ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది. ఇలాంటి మెసేజ్‌లకు రిప్లే ఇవ్వడం కానీ, రిజిస్టర్ చేసుకోవడం కానీ చేయవద్దని కోరింది. అలాగే విలువైన వ్యక్తిగత, బ్యాంకింగ్ సమచారాన్ని ఎవ్వరికీ తెలియజేయవద్దని సూచించింది.