కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం తీసుకువచ్చిన ముఖ్యమైన పథకాల్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి. ఈ పథకం కింద మోదీ సర్కార్ రైతుల పంటలకు బీమా సౌకర్యం (PMFBY) అందిస్తుంది. వర్షాలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ పథకం కింద పరిహారాన్ని అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
తద్వారా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అయితే.. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకంలో భారీగా మార్పులు చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరం దేశంలోని ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా అనేక పంటలు దెబ్బతిన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా.. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. వాతావరణ సంక్షోభం, వాతావరణ మార్పుల కారణంగా ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారీ మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)