Money | మోదీ సర్కార్ తాజాగా తీపికబురు అందించింది. సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా మహత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద అందించే డబ్బులను పెంచుతున్నట్లు వెల్లడించింది.
2/ 10
2022-2024 ఆర్థిక సంవత్సరానికి ఈ పెంపు వర్తిస్తుంది. దీని వల్ల కరువు పనికి వెళ్లే వారికి భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
3/ 10
రాష్ట్రాల ప్రాతిపదికన చూస్తే.. హరియాణలో కరువు పని డబ్బుల పెంపు ఎక్కువగా ఉంది. రోజుకు రూ. 357 లభిస్తాయి. మద్యప్రదేశ్, ఛండీఘర్‌లో అయితే తక్కువగా కరువు పని డబ్బులు లభిస్తాయి. ఇక్కడ రోజుకు రూ. 221 లభిస్తాయి.
4/ 10
మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ వేజ్ రేట్లు మార్చి 24 నుంచి మారాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యాంరటీ యాక్ట్‌లోని సెక్షన్ 6 (1) కింద పెంపునకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.
5/ 10
ఏప్రిల్ 1 నుంచి కరువు పని భత్యం పెంపు రూ. 7 నుంచి రూ. 26 వరకు ఉంటుంది. రాజస్థాన్‌లో చూస్తే కరువు పని కూలీ రూ. 231 నుంచి రూ. 255కు చేరింది.
6/ 10
బిహార్, ఝార్ఖండ్లలో కరువు పనికి వెళ్తే ప్రజలకు రోజుకు రూ. 228 వస్తాయి. ఇది వరకు ఈ మొత్తం రూ. 210గా ఉంది. ఛత్తీస్గర్, మధ్యప్రదేశ్‌లో కరువు పని కూలీ రూ. 221గా ఉంది. ఇదివరకు ఈ రాష్ట్రాల్లో ఈ మొత్తం రూ. 204గా ఉండేది.
7/ 10
బడ్జెట్ 2023లో కేంద్ర ప్రభుత్వం.. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ కోసంరూ. 60 వేల కోట్లు కేటాయించింది. గత నాలుగేళ్లలో చూస్తే ఇదే అతితక్కువ మొత్తం. 2022-23 కేటాయింపులు రూ. 73 వేల కోట్లుగా ఉండేవి.
8/ 10
కాగా ఈ కరువు పని కింద దాదాపు 8 కోట్ల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని చెప్పుకోవచ్చు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఈ స్కీమ్ కింద కూడా కొంత కాలం ప్రయోజనం లభించింది.
9/ 10
ఇకపోతే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మాస్టర్ రోల్ క్లోజ్ అయిపోయిన 15 రోజులలోగా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలోకి జమ కావాల్సి ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఈ పేమెంట్లు ఆలస్యం కూడా కావొచ్చు.
10/ 10
కేంద్ర ప్రభుత్వం ఆధార్ పేమెంట్ ఆప్షన్ ద్వారా చెల్లింపులు చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చి జమ అవుతాయి.