సవరించిన నిబంధనల ప్రకారం, ఎవరికి ఎక్కువ TDS విధిస్తారు?
* పన్ను మినహాయించాల్సిన/వసూళ్లు చేయాల్సిన ఆర్థిక సంవత్సరానికి ముందు ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయనివారికి, TDS, TCS అంతకు ముందు సంవత్సరంలో రూ.50,000 మించిన వారికి ఎక్కువ TDS విధిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) అధిక TDS వర్తిస్తుందా? లేదా? అని నిర్ధారించుకోవడానికి.. (ప్రతీకాత్మక చిత్రం)
ఆ వ్యక్తి సంబంధిత మునుపటి ఆర్థిక సంవత్సరానికి అంటే ఆర్థిక సంవత్సరం 2020-21కి ITR ఫైల్ చేశారా? లేదా? అని బ్యాంకులు తనిఖీ చేయాల్సి ఉంటుందని 2022 మే 17న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సర్క్యులర్ జారీ చేసింది. అదే విధంగా మునుపటి ఆర్థిక సంవత్సరంలో (2020-21) మొత్తం TDS, TCS రూ.50,000 మించి ఉంటే బ్యాంకులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. రెండు అంశాలు వర్తిస్తే అధిక TDS విధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
192: జీతాలు, 192A: PF ఖాతా నుంచి ఉపసంహరించుకొన్న నగదు, 194B: లాటరీ, గేమ్ షోలు, పజిల్స్ మొదలైన వాటి నుండి వచ్చే ఆదాయం, 194BB: గుర్రపు పందెం విజయాల నుంచి వచ్చే ఆదాయం, 194LBC: సెక్యురిటైజేషన్ ట్రస్ట్‌లో పెట్టుబడికి సంబంధించిన ఆదాయం, 194N: నిర్దిష్ట ఆర్థిక సంవత్సరాన్ని మించిన ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణ, 194-IA: స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు, 194-IB: నెలకు రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లించిన అద్దె, 194M: నివాస కాంట్రాక్టర్లు లేదా నిపుణులకు వ్యక్తిగత, HUFల ద్వారా నిర్దిష్ట మొత్తాల చెల్లింపులు. (ప్రతీకాత్మక చిత్రం)
194S: క్రిప్టో ఆస్తులు మొదలైన వర్చువల్ డిజిటల్ అసెట్(VDA) బదిలీపై TDS, అమ్మకాలు, స్థూల రసీదులు, అతను నిర్వహించే వ్యాపారం లేదా అతను చేసే వృత్తి నుంచి టర్నోవర్ రూ.కోటికి మించకూడదు(వ్యాపారం విషయంలో ) లేదా రూ.50 లక్షలు మించకూడదు(వృత్తి విషయంలో). ఈ విభాగం 2022 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎక్కువ TDS తీసివేయవలసి వస్తే బ్యాంకులు ఎలా తనిఖీ చేస్తాయి?
CBDT సర్క్యులర్ ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2022-23లో అధిక TDS వర్తించే నిర్దిష్ట వ్యక్తుల జాబితా, ఆర్థిక సంవత్సరం 2020-21ని సంబంధిత ఆర్థిక సంవత్సరంగా తీసుకుని తయారు చేశారు. 2021-22లో ITR ఫైల్ చేయని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో TDS, TCS మొత్తం రూ.50,000 దాటిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయి.