పైన పేర్కొన్నవన్నీ కాకుండా.. కొత్త పథకం రైల్వే స్టేషన్లో మంచి నాణ్యమైన సౌకర్యాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించేలా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో వివిధ రకాల వెయిటింగ్ రూమ్‌లు, మెరుగైన ఫలహారశాల సౌకర్యాలు మరియు రైల్వే స్టేషన్లలో మరింత ఆచరణీయమైన రిటైల్ షాపులు ఉన్నాయి.
డిజైన్ ఫర్నిచర్
రైల్వే స్టేషన్లో ఇప్పటికే ఉన్న ఫర్నిచర్‌ను సమీక్షించి.. తనిఖీ చేయడం కూడా ప్లాన్‌లో ఉంటుంది. ఫర్నిచర్ జాబితాలో వెయిటింగ్ రూమ్‌లు, రిటైరింగ్ రూమ్‌లు, ప్లాట్‌ఫారమ్‌లు , ఆఫీసులలో ఉంచిన ఫర్నిచర్ ఉంటుంది. తనిఖీ తర్వాత.. మరింత సౌకర్యవంతమైన, మన్నికైన , కొత్త ఫర్నిచర్ అవసరమైతే ఇప్పటికే ఉన్న ఫర్నిచర్ స్థానంలో ఏర్పాటు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)